గుర్తు తెలియని వ్యక్తుల నుంచి పార్టీలకు భారీగా విరాళాలు.. ఏ పార్టీకి ఎంతంటే?
దిశ, వెబ్‌డెస్క్: జాతీయ పార్టీలు, ప్రాంతీయ పార్టీలకు భారీగా విరాళాలు వస్తున్నాయి. బయటకు వివరాలు వెల్లడించని గు
దిశ, వెబ్‌డెస్క్: జాతీయ పార్టీలు, ప్రాంతీయ పార్టీలకు భారీగా విరాళాలు వస్తున్నాయి. బయటకు వివరాలు వెల్లడించని గుర్తు తెలియని వ్యక్తులు, సంస్థల నుంచి పెద్ద ఎత్తున విరాళాలు వచ్చినట్లు తేలింది. ఈ మేరకు అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫామ్స్(ADR) తన నివేదికలో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. 2020-21 ఆర్ధిక సంవత్సరంలో జాతీయ, ప్రాంతీయ పార్టీలకు గుర్తు తెలియని వ్యక్తులు, సంస్థల నుంచి రూ.690.67 కోట్లు విరాళంగా వచ్చాయి. ఇక 2004 నుంచి 2021 వరకు జాతీయ పార్టీలకు ఇలాంటి వ్యక్తులు, సంస్థల నుంచి రూ.15,077.97 కోట్లు విరాళంగా వచ్చినట్లు ఏడీఆర్ తన నివేదికలన బయటపెట్టింది.
ఈసీకి పార్టీలు సమర్పించిన విరాళలు, ఇన్ కమ్ ట్యాక్స్ రిటర్న్ ల వివరాల ఆధారంగా తాము సేకరించినట్లు ఏడీఆర్ తెలిపింది. 2020-21 ఆర్ధిక సంవత్సరంలో అత్యధికంగా కాంగ్రెస్ పార్టీకి వివరాలు బయటకు చెప్పని వ్యక్తులు, సంస్థల నుంచి రూ.178.782 కోట్లు విరాళంగా వచ్చాయి. బీజేపీకి రూ.100.502 కోట్లు, వైసీపీకి రూ..96.2507 కోట్లు, డీఎంకే రూ.80.02 కోట్లు, బీజేడీకి రూ.67 కెట్లు, ఆప్ కు రూ.5.4 కోట్లు వచ్చాయి.
Also Read : బండ్ల గణేష్ సంచలన ప్రకటన.. త్వరలో కొత్త న్యూస్ ఛానెల్?