ఏం కాదు... కొత్త పార్టీ గుర్తును తీసుకోండి
నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ చీఫ్ శరద్ పవార్ మహారాష్ట్ర మాజీ సీఎం ఉద్ధవ్ థాక్రేకకు కీలక.... Accept and take a new symbol: Sharad Pawar tells Uddhav Thackeray on ‘bow and arrow’ loss
న్యూఢిల్లీ: నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ చీఫ్ శరద్ పవార్ మహారాష్ట్ర మాజీ సీఎం ఉద్ధవ్ థాక్రేకకు కీలక సూచనలు చేశారు. ఎన్నికల కమిషన్ నిర్ణయాన్ని గౌరవించి కొత్త పార్టీ గుర్తును స్వీకరించాలని కోరారు. అయితే ఈసీ ఆదేశాలు ప్రజలపై పెద్దగా ఏమి ప్రభావం చూపవని, ప్రజలు కూడా కొత్త గుర్తున స్వీకరిస్తారని అన్నారు. 'ఇది ఈసీ నిర్ణయం. ఒక్కసారి ఖరారు చేస్తే దానిపై చర్చ అనవసరం. కొత్త గుర్తును స్వీకరించండి. గుర్తును కోల్పోవడం ప్రజల్లో ఎలాంటి ప్రభావం చూపించదు' అని అన్నారు. గతంలో కాంగ్రెస్ కూడా తన పార్టీ గుర్తును మార్చివేసిందనే విషయాన్ని గుర్తు చేశారు. కాంగ్రెస్ వలె ప్రజలు కూడా కొత్త గుర్తుకు అలవాటు పడతారని అన్నారు. అంతకుముందు ఇందిరా గాంధీ హాయంలో పార్టీ గుర్తు ఎడ్లబండిగా ఉండగా, తర్వాత హాస్తానికి మారింది. దీనిని ప్రజలు స్వీకరించారని పేర్కొన్నారు. కాగా, శుక్రవారం ఈసీ శివసేన గుర్తు బాణం-విల్లును షిండే వర్గానికి కేటాయిస్తున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే.