AAP Candidate List: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు.. 11 మందితో తొలి జాబితా విడుదల చేసిన ఆప్
వచ్చే ఏడాది ప్రారంభంలోనే ఢిల్లీ అసెంబ్లీకి ఎన్నికలు (Delhi Assembly Election) జరగనున్నాయి. ఇలాంటి టైంలో అధికార ఆమ్‌ఆద్మీపార్టీ (AAP) అభ్యర్థుల తొలిజాబితాను విడుదల చేసింది.
దిశ, నేషనల్ బ్యూరో: వచ్చే ఏడాది ప్రారంభంలోనే ఢిల్లీ అసెంబ్లీకి ఎన్నికలు (Delhi Assembly Election) జరగనున్నాయి. ఇలాంటి టైంలో అధికార ఆమ్‌ఆద్మీపార్టీ (AAP) అభ్యర్థుల తొలిజాబితాను విడుదల చేసింది. 11 మంది అభ్యర్థుల పేర్లను ఆప్ (AAP Candidate List) ప్రకటించింది. ఇందులో బీజేపీ, కాంగ్రెస్ నుంచి ఆప్ లో చేరిన వారే ఆరుగురు ఉన్నారు. బ్రహ్మ్ సింగ్ తన్వర్, అనిల్ ఝా, బీబీ త్యాగి బీజేపీ మాజీ నేతలు కాగా.. చౌధరీ జుబైర్ అహ్మద్, వీర్ ధింగన్, సుమేశ్ షోకీన్ కాంగ్రెస్ నుంచి ఆప్‌లో చేరారు. కేజ్రీవాల్ ప్రకటించిన జాబితాలో సరితా సింగ్, రామ్ సింగ్ నేతాజీ, గౌరవ్ శర్మ, మనోజ్ త్యాగీ, దీపక్ సింఘాల్ కూడా ఉన్నారు. మొత్తం 70 అసెంబ్లీ స్థానాలున్న ఢిల్లీలో వచ్చే ఏడాది ఫిబ్రవరిలో ఎన్నికలు జరగనున్నాయి. ఇకపోతే,2020లో జరిగిన ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ 70 స్థానాల్లో 62 స్థానాలను గెలుచుకున్నది.
లిక్కర్ స్కాం
మరోవైపు, ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో కేసులో ఆరోపణలతో ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్(Arvind Kejriwal) జైలుకు వెళ్లారు. జైలు నుంచి వచ్చాక సీఎం పదవికి రాజీనామా చేశారు. ప్రజలు మళ్లీ తనకు విశ్వనీయత ఇచ్చేవరకు ఆ పదవిలోకి రానని ప్రకటించారు. పదవికి రాజీనామా చేసిన కేజ్రీవాల్.. రానున్న ఎన్నికల కోసం పార్టీ ముందుకు నడిపిస్తున్నారు. ఇక ఈ ఎన్నికల సమయంలో నేతలు పార్టీలు మారుతున్నారు. ఢీల్లీ మంత్రిగా పనిచేసిన కైలాశ్ గెహ్లోత్ (Kailash Gahlot) కొద్దిరోజుల క్రితమే బీజేపీలో చేరారు.