Miss Universe 2024: ఆమె అందానికి ప్రపంచం ఫిదా
అందాల పోటీల్లో డెన్మార్క్ యువతి(Denmark Girl) ప్రపంచ దృష్టిని ఆకర్షించింది. మెక్సికో వేదికగా జరిగిన ఈ పోటీల్లో 21 ఏళ్ల డెన్మార్క్ యువతి విక్టోరియా కెజార్ హెల్విగ్(Victoria Kezar Helwig) విశ్వసుందరి(Miss Universe) కిరీటం దక్కించుకున్నది.
దిశ, వెబ్‌డెస్క్: అందాల పోటీల్లో డెన్మార్క్ యువతి(Denmark Girl) ప్రపంచ దృష్టిని ఆకర్షించింది. మెక్సికో వేదికగా జరిగిన ఈ పోటీల్లో 21 ఏళ్ల డెన్మార్క్ యువతి విక్టోరియా కెజార్ హెల్విగ్(Victoria Kezar Helwig) విశ్వసుందరి(Miss Universe) కిరీటం దక్కించుకున్నది. తొలి రన్నరప్‌గా నైజీరియా భామ చిడిమ్మ అడెట్షినా నిలిచింది. ఇక సెకండ్ రన్నరప్‌గా మెక్సికో యువతి ఫెర్నాండా కిరీటం దక్కించుకున్నది. ఇక భారత్ నుంచి ఈ పోటీల్లో అహ్మదాబాద్ మోడల్ రిహా సింగా పాల్గొన్నారు. అయితే ఈ బ్యూటీ టాప్-30 వరకు చేరుకోగలిగింది. కానీ తర్వాతి రౌండ్‌లో వెనుదిరగాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీంతో ఈ ఏడాది కూడా మిస్ యూనివర్స్ కిరీటం భారత్ చేజారిపోయింది. ఇక మిస్ యూనివర్స్‌గా నిలిచిన డెన్మార్క్ యువతి విక్టోరియాకు గత ఏడాది మిస్ యూనివర్స్ పోటీల్లో విజేతగా నిలిచిన అమెరికన్ మోడల్ షెన్నిస్ పలాసియోస్ కిరీటాన్ని అందించారు.