మహిళతో జార్ఖండ్ మంత్రి అసభ్య ఫోన్ కాల్.. సోషల్ మీడియాలో వీడియో వైరల్

ఓ మహిళకు జార్ఖండ్ మంత్రి బన్నా గుప్తా వీడియో కాల్ చేసి అసభ్యంగా మాట్లాడినట్లు ఉన్న ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Update: 2023-04-24 16:52 GMT

దిశ, వెబ్ డెస్క్: ఓ మహిళకు జార్ఖండ్ మంత్రి బన్నా గుప్తా వీడియో కాల్ చేసి అసభ్యంగా మాట్లాడినట్లు ఉన్న ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీంతో అక్కడి ప్రతిపక్షాలు ఆరోగ్య శాఖ మంత్రి (కాంగ్రెస్ ఎమ్మెల్యే) బన్నా గుప్తా రాజీనామా చేయాలంటూ డిమాండ్ చేస్తున్నాయి. రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి బన్నా గుప్తా ఫోన్ లో ఓ మహిళతో మాట్లాడారు. వారిద్దరి మధ్య అసభ్య సంభాషణ జరిగినట్లుగా నెట్టింట చక్కర్లు కొడుతున్న వీడియో ద్వారా ఈ విషయం తెలుస్తోంది. కాగా సదరు వీడియోను బీజేపీ ఎంపీ నిషికాంత్ దుబే ట్విట్టర్ వేదిక ద్వారా షేర్ చేశారు.

ఈ సందర్భంగా నిషికాంత్ దుబే కాంగ్రెస్ పార్టీపై తీవ్ర విమర్శలు చేశారు. కాంగ్రెస్ తీరు ఇది అని, మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించినందుకు కాంగ్రెస్ పార్టీ నాయకులు సిగ్గుతో తలదించుకోవాలని అన్నారు. ఈ విషయంపై సీఎం హేమంత్ సోరెన్ స్పందించి మంత్రిపై తగిన చర్యలు తీసుకోవాలని బీజేపీ డిమాండ్ చేసింది. కాగా ఆ వీడియోపై మంత్రి బన్నా గుప్తా స్పందించారు. అది తన వీడియో కాదని, ఎవరో కావాలనే  వీడియో ఎడిట్ చేసి రాజకీయంగా తనను బద్నాం చేయాలని చూస్తున్నారని అన్నారు. 

Tags:    

Similar News