కర్ణాటక ముఖ్యమంత్రికి తృటిలో తప్పిన ముప్పు

కర్ణాటక సీఎం బసవరాజు బొమ్మై తృటిలో పెనుప్రమాదం నుంచి తప్పించుకున్నారు. ఆయన ప్రయాణిస్తున్న హెలికాప్టర్ ల్యాండింగ్ సమయంలో మంటలు చెలరేగాయి.

Update: 2023-04-13 11:44 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: కర్ణాటక సీఎం బసవరాజు బొమ్మై తృటిలో పెనుప్రమాదం నుంచి తప్పించుకున్నారు. ఆయన ప్రయాణిస్తున్న హెలికాప్టర్ ల్యాండింగ్ సమయంలో మంటలు చెలరేగాయి. గురువారం ఎన్నికల ప్రచారంలో భాగంగా ఉడిపికి వెళ్లిన సీఎం బొమ్మైకి చేదు అనుభవం ఎదురైంది. ఉడిపి జిల్లా కొల్లురులో ఉన్న మూకాంబికా గుడి దర్శనానికి సీఎం బొమ్మై తన భార్యతో కలిసి వెళ్లారు. అయితే ఆరేశిరూరు హెలిప్యాడ్ వద్ద హెలికాప్టర్ ల్యాండ్ అవుతున్న సమయంలో ఫ్యాన్ నుంచి మంటలు చెలరేగాయని అధికారులు తెలిపారు. వెంటనే అప్రమత్తమైన ఫైర్ సిబ్బంది మంటలు ఆర్పడంతో ప్రమాదం తప్పిందని అధికారులు పేర్కొన్నారు. అనంతరం మూకాంబికా అమ్మవారిని దర్శించుకుని సీఎం బొమ్మై, ఆయన సతీమణి పూజలు చేశారు.

Tags:    

Similar News