ఇండియా కూటమికి బిగ్ షాక్.. ప్రధాన మంత్రి అభ్యర్థిగా ఆ రాష్ట్ర సీఎం?
రేపు విపక్షాల ఇండియా కూటమి మూడో భేటీకి సిద్ధం అవుతున్న వేళ ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ ప్రతినిధి ప్రియాంక కక్కర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 'ఇండియా' కూటమి తరపున ప్రధాని అభ్యర్థిగా తాను కేజ్రీవాల్ ఉండాలని ప్రతిపాదిస్తున్నానన్నారు.
దిశ, డైనమిక్ బ్యూరో: రేపు విపక్షాల ఇండియా కూటమి మూడో భేటీకి సిద్ధం అవుతున్న వేళ ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ ప్రతినిధి ప్రియాంక కక్కర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 'ఇండియా' కూటమి తరపున ప్రధాని అభ్యర్థిగా తాను కేజ్రీవాల్ ఉండాలని ప్రతిపాదిస్తున్నానన్నారు. అలాగే కూటమికి కన్వీనర్‌గా కేజ్రీవాల్ ఉండాలన్నారు. బుధవారం మీడియాతో మాట్లాడిన ఆమె అనేక విషయాల్లో కేజ్రీవాల్ ప్రధాని నరేంద్రమోడీకి సవాలుగా మారారని, ద్రవ్యోల్బణం పరిస్థితుల్లోనూ ఢిల్లీ ప్రజలకు అనేక సంక్షేమ పథకాల ద్వారా మెరుగై పాలన అందిస్తున్నారని చెప్పుకొచ్చారు. అయితే కూటమి విషయంలో ఆమ్ ఆద్మీ పార్టీ మొదటి నుంచి కొంచెం ఇష్టం.. కొంచెం కష్టం అన్నట్లుగా వ్యవహరిస్తోందని ఇలాంటి పరిస్థితుల్లో కూటమి మూడో భేటీకి ఒక్కరోజు ముందు ప్రియాంక కక్కర్ చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్‌గా మారాయి.