56 బ్లేడ్లను రెండుగా విరిచి మింగిన వ్యక్తి!

రాజస్థాన్‌కు చెందిన 25 ఏళ్ల యువకుడు ఏకంగా 56 బ్లేడ్లను మింగాడు.

Update: 2023-03-14 17:13 GMT

దిశ, వెబ్‌డెస్క్: రాజస్థాన్‌కు చెందిన 25 ఏళ్ల యువకుడు ఏకంగా 56 బ్లేడ్లను మింగాడు. అతను తన నలుగురు ఫ్రెండ్స్ తో కలిసి ఓ రూమ్‌లో ఉంటున్నాడు. ఒక రోజు ఇంట్లో ఒంటరిగా ఉన్న టైంలో ఒక్కసారిగా రక్తపు వాంతులు చేసుకున్నాడు. తీవ్ర అస్వస్థతకు గురైన అతన్ని స్నేహితులు హాస్పిటల్ కు తీసుకెళ్లారు. అక్కడ డాక్టర్ నర్సిరామ్ దేవాసి ఆ యువకుడి సమస్య తెలుసుకునేందుకు ఎక్స్ రే తీయించారు. అయితే ఎక్స్ రే తర్వాత కడుపులో ఏదో మెటల్ ఉన్నట్లు గుర్తించారు. కడుపులో ఏం ఉందో తెలుసుకోవడానికి సోనోగ్రఫీ, ఎండోస్కోపీ నిర్వహించగా డాక్టర్లకి యువకుడి కడుపులో బ్లేడ్లు ఉన్నట్లు తెలిసింది.

వెంటనే ఆపరేషన్ చేసి 56 బ్లేడ్లు కడుపులోంచి తీశారు. ప్రస్తుతం యువకుడి హెల్త్ కండిషన్ నిలకడగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. అయితే యువకుడు బ్లేడ్లను కవర్లతో సహా తిన్నాడని అందుకే నొప్పిగానీ, బ్లీడింగ్ కానీ కాలేదని తెలిపారు. అయితే కడుపులో కాగితం కరిగిపోయి బ్లేడ్లు మాత్రమే ఉండిపోగా క్రమంగా అనారోగ్యం బారిన పడ్డాడు. యువకుడికి కడుపులో గ్యాస్ ఫాం అయి వాంతులు చేసుకున్నట్లు తెలిపారు. బ్లేడు తినే సమయంలో వాటిని రెండుగా విరిచి తిన్నట్లు వైద్యులు తెలిపారు. అయితే సదరు యువకుడు ఇలా ఎందుకు చేశాడనే విషయం మాత్రం ఇంకా తెలియలేదు. 

Tags:    

Similar News