కేంద్రం, రైతుల సంఘాల చర్చల్లో కీలక పరిణామం

దేశ రాజధాని ఢిల్లీ శివారులో ఆందోళనలు చేపట్టిన రైతులతో కేంద్ర ప్రభుత్వం చర్చలు జరిపింది. ఈ సందర్భంగా కేంద్రం, పంజాబ్ రైతు సంఘాల నాయకుల చర్చల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది.

Update: 2024-02-19 03:45 GMT

దిశ, వెబ్‌డెస్క్: దేశ రాజధాని ఢిల్లీ శివారులో ఆందోళనలు చేపట్టిన రైతులతో కేంద్ర ప్రభుత్వం చర్చలు జరిపింది. ఈ సందర్భంగా కేంద్రం, పంజాబ్ రైతు సంఘాల నాయకుల చర్చల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. కనీస మద్దతు ధరపై కీలక ప్రతిపాదనను కేంద్రం రైతులు ముందు పెట్టింది. రైతులతో ఒప్పందం కుదిరితే కనీసం ఐదేళ్లు మద్దతు ధర కొనసాగేలా ప్రతిపాదనలు చేశారు. పుప్పు ధాన్యాలు, మొక్క జొన్న, పత్తి పంటలను కనీస మద్దతు ధరతో ప్రభుత్వ సంస్థలు కొనుగోలు చేసేలా కేంద్రమంత్రుల బృందం పీయూష్ గోయల్, అర్జున్ ముండా, నిత్యానందరాయ్ రైతులతో చర్చలు జరిపారు.

ఈ సందర్భంగా పీయూష్ గోయల్ మాట్లాడుతూ.. ఎన్‌సీసీఎఫ్, ఎన్ఏఎఫ్‌ఈడీ, సీసీఐ వంటి సంస్థలు ఒప్పందం కుదుర్చుకున్నాయని తెలిపారు. ఉత్పత్తి మొత్తాన్ని కొనుగోలు చేస్తామని.. ఎలాంటి పరిమితులు విధించబోము అని స్పష్టం చేశారు. కొనుగోళ్ల కోసం ప్రత్యేక పోర్టల్‌ను అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు. తాజా ప్రతిపాదనలతో పంజాబ్ వ్యవసాయానికి రక్షణ లభిస్తుందని అన్నారు. కాగా, కేంద్రం చర్చల అనంతరం రైతు సంఘాలు కూడా స్పందిచాయి. ప్రతిపాదనలపై అందరం మరొక సారి చర్చించి నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. ప్రస్తుతానికి ఢిల్లీలో ఆందోళనను విరమించినట్లు ప్రకటించారు. పరిష్కారం లభించకపోతే ఈ నెల 21 నుంచి మళ్లీ నిరసన చేస్తామని రైతు సంఘాలు తెలిపాయి.

Tags:    

Similar News