ట్రంప్‌కు భారీ ఊరట..రహస్య పత్రాల కేసు కొట్టేసిన న్యాయస్థానం

కాల్పుల ఘటన నుంచి సురక్షితంగా బయటపడిన అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంపుకు భారీ ఊరట లభించింది. అక్రమంగా రహస్య పత్రాలను అక్రమంగా కలిగి ఉన్నారని నమోదైన క్రిమినల్ కేసును యూఎస్‌లోని ఫెడరల్ కోర్టు కొట్టివేసింది.

Update: 2024-07-15 15:56 GMT

దిశ, నేషనల్ బ్యూరో: కాల్పుల ఘటన నుంచి సురక్షితంగా బయటపడిన అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంపుకు భారీ ఊరట లభించింది. అక్రమంగా రహస్య పత్రాలను అక్రమంగా కలిగి ఉన్నారని నమోదైన క్రిమినల్ కేసును యూఎస్‌లోని ఫెడరల్ కోర్టు కొట్టివేసింది. ఈ మేరకు ప్లోరిడా కోర్టుకు చెందిన న్యాయమూర్తి ఐలీన్ కానన్ తీర్పు వెల్లడించారు. ప్రత్యేక న్యాయవాది జాక్ స్మిత్ నియామకం రాజ్యాంగాన్ని ఉల్లంఘించిందని తీర్పులో పేర్కొన్నారు. దీంతో అధ్యక్ష రేసులో ఉన్న ట్రంపుకు ఎన్నికల ముందు భారీ విజయం లభించింది. ప్రెసిడెంట్ పదవి అనంతరం మార్-ఎ-లాగో సోషల్ క్లబ్‌లో ముఖ్యమైన జాతీయ భద్రతా పత్రాలను నిలిపివేసినట్లు ట్రంపుపై ఆరోపణలు వచ్చాయి. మెటీరియల్‌ని తిరిగి పొందేందుకు ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలను అడ్డుకున్నారని అభియోగాలు నమోదయ్యాయి. దీనిపై విచారణ చేపట్టిన న్యాయస్థానం తాజాగా తీర్పు వెలువరించింది.

నేను చనిపోయాననే అనుకున్నా: ట్రంప్

పెన్సిల్వేనియా ర్యాలీలో తనపై జరిగిన హత్యాయత్నాన్ని ట్రంప్ మరోసారి గుర్తు చేసుకున్నారు. దాడి అనంతరం తాను చనిపోయానని భావించినట్టు తెలిపారు. తాజాగా ఆయన ఓ ఇంటర్వ్యూలో భాగంగా మాట్లాడారు. ఈ ఘటన ఒక విచిత్ర అనుభవమని చెప్పారు. ఇలాంటి దాడిని ఎన్నడూ చూడలేదని ఆస్పత్రిలోని డాక్టర్లు సైతం తనకు చెప్పినట్టు తెలిపారు. తనను కాపాడిన సీక్రెట్ సర్వీస్ ఏజెంట్లకు కృతజ్ఞతలు తెలిపారు. 

Tags:    

Similar News