ఈ ఆటోవాలా రూటే సెపరేట్.. ఇంతకు ఏం చేశాడంటే?

బైక్, కారు, ఆటో.. ఇలా ఏ వాహనం కొన్నా రిజిస్ట్రేషన్ కంపల్సరీగా చేసుకోవాలి.

Update: 2023-04-07 14:10 GMT

దిశ, వెబ్ డెస్క్: బైక్, కారు, ఆటో.. ఇలా ఏ వాహనం కొన్నా రిజిస్ట్రేషన్ కంపల్సరీగా చేసుకోవాలి. ఇక రిజిస్ట్రేషన్ నెంబర్ లేకుండా ప్రయాణం చేసి పోలీసులకు చిక్కితే అంతే సంగతులు. జరిమానాలు, జైలు శిక్ష వంటివి తప్పవు. ఆర్టీవో అధికారులు ఒక్కో వాహనానికి ఒక్కో రిజిస్ట్రేషన్ నెంబర్ కేటాయిస్తారు. కానీ బెంగళూరుకు చెందిన ఓ ఆటోడ్రవైర్ ఇలాంటి రూల్స్ ను ఏమాత్రం పట్టించుకోడు. తనకున్న ఒకే ఆటోకు  మూడు నెంబర్ ప్లేట్ లు తగిలించాడు. ఈ ఆటోకు సంబంధించిన ఫోటోను సుప్రీత్ జాదవ్ అనే వ్యక్తి ట్విట్టర్ లో షేర్ చేశాడు. ఆటోపై కనిపిస్తున్న మూడు నెంబర్లలో OLA KA AL 213 ఒక నెంబర్ కాగా.. RAPIDO KA 01 AF 244 రెండోది. ఇక KA 01 AE 973 అని మరో నెంబర్ కూడా ఆటోపై కనిపిస్తోంది.

కాగా సుప్రీత్ జాదవ్ ట్వీట్ కు నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. ఓలా బుక్ చేసుకున్నప్పుడు ఇలాంటి వాహనం వస్తే ఎలా అని తలుచుకుంటే భయమేస్తోంది. ఏదైనా నేరం జరిగినప్పుడు ఇలాంటి వాహనాలను ఓలా సపోర్టు బృందం, బెంగళూరు ట్రాఫిక్ పోలీసులు ఎలా పట్టుకుంటారు అంటూ దీప అనే ఓ ట్విట్టర్ యూజర్ ప్రశ్నించారు. ఇక ఆమె ప్రశ్నకు ఓలా సంస్థ స్పందించింది. ‘ఈ విషయంపై విచారణ చేస్తాం. ఇందుకు సంబంధించిన సీఆర్ఎన్, అలాగే మీ ఈమెయిల్ ఐడీ పంపిస్తే త్వరగా విచారణ చేస్తాం’’ అంటూ ఓలా సపోర్ట్ బదులిచ్చింది. ఇక ఒకే వెహికిల్ కు మూడు రిజిస్ట్రేషన్లు నిజంగానే ఉంటాయా అంటూ మరో నెటిజన్ అడిగాడు. 

Tags:    

Similar News