జీడీపీ వృద్ధిపై స్పందించిన ప్రధాని మోడీ
క్యూ3లో దేశ జీడీపీ వృద్ధి 8.4 శాతంగా నమోదవడం భారత ఆర్థికవ్యవస్థ బలాన్ని, సామర్థ్యాన్ని సూచిస్తుంది.
దిశ, నేషనల్ బ్యూరో: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం డిసెంబర్ త్రైమాసికంలో భారత ఆర్థికవ్యవస్థ 8.4 శాతం వృద్ధి చెందినట్టు ప్రభుత్వ గణాంకాలు వెల్లడించాయి. దీని గురించి భారత ప్రధాని నరేంద్ర మోడీ స్పందించారు. 'క్యూ3లో దేశ జీడీపీ వృద్ధి 8.4 శాతంగా నమోదవడం భారత ఆర్థికవ్యవస్థ బలాన్ని, సామర్థ్యాన్ని సూచిస్తుంది. 140 కోట్ల భారతీయులు మెరుగైన జీవితాన్ని గడిపేందుకు, వికసిత్ భారత్‌ను రూపొందించడంలో సహాయపడే వేగవంతమైన వృద్ధి కోసం తమ ప్రయత్నాలు కొనసాగుతాయని ' ఎక్స్‌లో ట్వీట్ చేశారు. గురువారం విడుదలైన ప్రభుత్వ డేటాలో దేశ జీడీపీ ఊహించిన దానికంటే అధికంగా వృద్ధి వెల్లడైంది. ప్రధాన రంగాలైన నిర్మాణ, తయారీ, వ్యవసాయ రంగాల్లో ఉత్పత్తి ఇందుకు ప్రధాన కారణం.