అవార్డుల ఫంక్షన్ వెళ్లి వడ దెబ్బతో 8 మంది మృతి
మహారాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రధానం చేసే మహారాష్ట్ర భూషణ్ అవార్డుల కార్యక్రమం విషాదం నింపింది.
దిశ, వెబ్‌డెస్క్: మహారాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రధానం చేసే మహారాష్ట్ర భూషణ్ అవార్డుల కార్యక్రమం విషాదం నింపింది. నవీ ముంబైలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి లక్షలాది మంది ప్రజలు హాజరయ్యారు. అయితే ఈ కార్యక్రమం ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 2 వరకు నిర్వహించారు. ఎండ తీవ్రత అధికంగా ఉండటం.. ప్రజలు అత్యధిక సంఖ్యలో హాజరు కావడం.. మంచినీరు సరిగా అందక పోవడంతో ప్రజలు సన్ స్ట్రోక్ (వడదెబ్బ)కు గురయ్యారు. దీంతో సుమారు 50 మంది వరకు అస్వస్థతకు గురయ్యారు.
వీరిలో 8 నుంచి 11 మంది మృతి చెందినట్లు తెలుస్తోంది. అలాగే మరో 24 మంది నవీ ముంబై లోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్లు అధికారులు తెలిపారు. ఈ విషాదంపై ఆ రాష్ట్ర ముఖ్రమంత్రి తీవ్ర దిగ్‌బ్రాంతి వ్యక్తం చేశారు. అలాగే మృతుల కుటుంబాలకు రూ. 5 లక్షల చొప్పున పరిహారం అందిస్తామని.. వడదెబ్బకు గురై చికిత్స పొందుతున్న వారికి ఉచితంగా వైద్యం అందజేస్తామని, వారి చికిత్సకు రాష్ట్ర ప్రభుత్వ ఖజానా నుంచి డబ్బులు చెల్లిస్తుందని సీఎం తెలిపారు.