Maharashtra: ‘మహా’ కొత్త సీఎంకు 72 గంటలే గడువు.. రాష్ట్రపతి పాలన తప్పించుకుంటుందా?
మహారాష్ట్ర కొత్త సీఎం ప్రమాణ స్వీకారానికిి 72 గంటలే గడువు ఉండటం చర్చగా మారింది.
దిశ, డైనమిక్ బ్యూరో: మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో (Maharashtra Results) మహాయుతి కూటమి భారీ విజయం నమోదు చేసుకుంది. అయితే స్పష్టమైన మెజార్టీ కూటమికి వచ్చినా కొత్త ముఖ్యమంత్రి (New CM) ప్రమాణ స్వీకారం చేయడానికి కేవలం 72 గంటల గడువు మాత్రమే ఉండటం ఇప్పుడు మహా పాలిటిక్స్ ను మరింత రసవత్తరంగా మారుస్తున్నాయి. మహారాష్ట్ర అసెంబ్లీ గడువు ఈ నెల 26న తీరిపోతుంది. ఆ లోపలే కొత్త సీఎం ఎంపిక, ప్రమాణ స్వీకారం జరగాల్సివుంటుంది. లేకపోతే సాంకేతికంగా రాష్ట్రపతి పాలన (President's Rule) విధించాల్సి ఉంటుంది. దీంతో కొత్త ముఖ్యమత్రిపై కూటమిలో ఎన్డీయే కూటమిలో ఏకాభిప్రాయం సాధించాల్సి ఉంది. ఇప్పటికే కూటమిలోని బీజేజేపీ, శివసేన(ఏక్ నాథ్ షిండే వర్గం), ఎన్సీపీ (అజిత్ పవార్ వర్గం) మూడు పార్టీలు సీఎం పదవిని ఆశిస్తున్నాయి. ఈ నేపథ్యంలో గడువు లోపే ఏకాభిప్రాయం సాధిస్తారా లేక ఎత్తులకు పై ఎత్తులతో మరేదైనా సంచలనానికి తెరతీస్తారా అనేది సస్పెన్స్ గా మారింది. అసెంబ్లీ ఎన్నికల తర్వాత మహారాష్ట్రలో రాష్ట్రపతి పాలన కొత్తేమీ కాదు. 2019, 2014 ఎన్నికల మహారాష్ట్రలో స్వల్ప కాలం పాటు రాష్ట్రపాతి పాలన విధించిన సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే ముంచుకొస్తున్న గడువు నేపథ్యంలో సీఎం ఎంపిక విషయంలో మహయుతి కూటమి వేగం పెంచింది. ఈ నెల 25న మహారాష్ట్ర బీజేపీ శాసనసభా పక్ష సమావేశం నిర్వహించబోతున్నది. 26న కొత్త సీఎం ప్రమాణ స్వీకారం చేయబోతున్నట్లు తెలుస్తున్నది. ఫలితాల నేపథ్యంలో మహారాష్ట్ర సీఎం ఏక్ నాథ్ షిండే, దేవేంద్ర ఫడ్నవీస్ తో కేంద్ర మంత్రి అమిత్ షా మాట్లాడారు. వారికి అభినందనలు తెలిపారు.
Read More..
Eknath Shinde: మహాయుతి కూటమి బంపర్ విక్టరీ.. సీఎం పదవిపై ఏక్‌నాథ్ షిండే కీలక వ్యాఖ్యలు