సుప్రీంకోర్టును ఆశ్రయించిన 700 మంది త్రిపుర ఉపాధ్యాయులు

తమ తొలగింపు చట్టవిరుద్ధం, రాజ్యాంగ విరుద్ధమని వారు పిటిషన్‌లో పేర్కొన్నారు.

Update: 2024-04-11 17:00 GMT

దిశ, నేషనల్ బ్యూరో: త్రిపురకు చెందిన దాదాపు 700 మంది అండర్ గ్రాడ్యుయేట్ ఉపాధ్యాయులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. 2017, 2020లో తమ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన తొలగింపు ఉత్తర్వులను సవాలు చేస్తూ వారు అత్యున్నత న్యాయస్థానానికి వెళ్లారు. తమ తొలగింపు చట్టవిరుద్ధం, రాజ్యాంగ విరుద్ధమని వారు పిటిషన్‌లో పేర్కొన్నారు. 2014లో త్రిపున హైకోర్టు డివిజన్ బెంచ్ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన నిర్దిష్ట నియామక ప్రక్రియ చట్టపరంగా చెడ్డదని చెప్పినట్టు రాజ్యాంగంలోని ఆర్టికల్ 32(రాజ్యాంగం పరిష్కారాల హక్కు) కింద దాఖలు చేసిన పిటిషన్‌లో తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం తెచ్చిన కొత్త నియామక విధానంతో సుమారు 10 వేల మంది కొత్త ఉద్యోగాల నియామకాన్ని హైకోర్టు పక్కన పెట్టింది. అందులో చాలా నియామకాలకు రాష్ట్ర ప్రభుత్వ రద్దు చేసినట్టు వివరించారు. తొలగించిన ఉపాధ్యాయుల జీతం కోడ్‌లు ఇంకా యాక్టివ్‌గానే ఉన్నాయని, వారి నెలవారీ జీతాలు రాష్ట్ర ఖజానాలో జమ అవుతున్నట్టు పిటిషనర్లు చెప్పారు. ఆ సొమ్మును కొందరు అవినీతి అధికారులు దుర్వినియోగం చేస్తున్నట్టు ఆరోపణలు చేశారు. ఈ క్రమంలోనే త్రిపుర ప్రభుత్వం భారీ కుంభకోణానికి పాల్పడుతోందన్నారు. తొలగించబడిన ఉపాధ్యాయుల పరిస్థితి అగమ్యగోచరంగా ఉందని, 160 మందికి పైగా ఉపాధ్యాయులు ఇప్పటికే ఆర్థిక సమస్యల వల్ల మరణించారని, అనేక మంది ఆత్మహత్యలు చేసుకున్నట్టు పిటిషన్‌లో పేర్కొన్నారు. ఇదే సమయంలో రాష్ట్రంలోని పాఠశాల విద్యావ్యవస్థ ఎదుర్కొంటున్న దారుణ పరిస్థితిని ప్రస్తావిస్తూ, ఉపాధ్యాయుల కొరత కారణంగా విద్యార్థులు నాణ్యమైన విద్యకు దూరమవుతున్నట్టు మొరపెట్టుకున్నారు. తిరిగి తమను విధుల్లోకి తీసుకునేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని విజ్ఞప్తి చేశారు. 

Tags:    

Similar News