33 Percent reservation: సహకార సంఘాల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్..ఉత్తరాఖండ్ కీలక నిర్ణయం!

సహకార సంఘాల్లో మహిళలకు 33శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ ఉత్తరాఖండ్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర సహకార మంత్రి డాక్టర్ ధన్ సింగ్ రావత్ ప్రతిపాదనకు సీఎం పుష్కర్ సింగ్ ధామి మంత్రివర్గం మంగళవారం ఆమోదం తెలిపింది.

Update: 2024-07-30 13:51 GMT

దిశ, నేషనల్ బ్యూరో: సహకార సంఘాల్లో మహిళలకు 33శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ ఉత్తరాఖండ్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర సహకార మంత్రి డాక్టర్ ధన్ సింగ్ రావత్ ప్రతిపాదనకు సీఎం పుష్కర్ సింగ్ ధామి మంత్రివర్గం మంగళవారం ఆమోదం తెలిపింది. దీంతో సహకార బ్యాంకులు, సొసైటీల్లో మహిళలకు 33శాతం సీట్లు కేటాయించనున్నారు. ఈ నిర్ణయం తీసుకున్న మొదటి రాష్ట్రంగా ఉత్తరాఖండ్ నిలిచింది. మహిళా సాధికారత, సహకార రంగంలో వారి భాగస్వామ్యాన్ని ప్రోత్సహించడం లక్ష్యంగా పెట్టుకున్నట్టు ధన్ సింగ్ తెలిపారు. జిల్లా సహకార బ్యాంకులు, సొసైటీలు, రాష్ట్ర స్థాయి సహకార సంఘాలతో సహా వివిధ సంఘాలకు ఈ నిర్ణయం వర్తిస్తుందని చెప్పారు. సహకార సంఘాల ద్వారా శ్రేయస్సు అనే ప్రధాని మోడీ సూచనతో సహకార సంఘాల్లో మహిళల భాగస్వామ్యం ఉండేలా చేశామన్నారు. కాగా, ఈ నెల 6వ తేదీన ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి అధ్యక్షతన జరిగిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకోగా దానికి కేబినెట్ తాజాగా ఆమోదం తెలిపింది. 

Tags:    

Similar News