భారత్‌లో మరోసారి కరోనా కలకలం.. వందల సంఖ్యలో పాజిటివ్ కేసులు

మూడేళ్ల కిందట ప్రపంచాన్ని వణికించిన కరోనా మహామ్మారి మరోసారి భారత్ లో పంజా విసురుతుంది.

Update: 2024-05-22 03:33 GMT

దిశ, వెబ్ డెస్క్: మూడేళ్ల కిందట ప్రపంచాన్ని వణికించిన కరోనా మహామ్మారి మరోసారి భారత్ లో పంజా విసురుతుంది. దేశంలో వందల సంఖ్యలో కొత్త వేరియంట్ పాజిటీవ్ కేసులు నమోదు కావడం కలకలం సృష్టిస్తుంది. తాజాగా.. భారత ఆరోగ్య మంత్రిత్వ శాఖ విడుదల చేసిన బులిటెన్ ప్రకారం.. దేశంలో కేపీ-1, కేపీ-2 వేరియంట్ కేసులు నమోదయ్యాయి. ఇందులో కేపీ-1 34 కేసులు, కేపీ-2 వేరియంట్ 290 కేసులు నమోదయ్యాయి. అయితే ఈ కొత్త వేరియంట్లతో భయపడాల్సిన అవసరం లేదని.. ఇవి అంత ప్రాణాంతకం కాదని భారత మంత్రిత్వ శాఖ తెలిపింది. ఇదిలా ఉంటే ప్రపంచం మొత్తం కనుమరుగైన కరోనా తాజాగా సింగపూర్ లో మాత్రం విజృంభిస్తుంది. గత వారం రోజుల్లో ఆ దేశంలో 25,900 కొవిడ్ కేసులు నమోదైనట్లు ప్రకటించింది. దీంతో ఆ దేశానికి వెళ్లి వస్తున్న వారిపై ఆయా దేశాలు అప్రమత్తంగా ఉండాలని సూచించాయి.


Similar News