చరిత్ర సృష్టించిన సుప్రీంకోర్టు.. 75 ఏళ్ల రికార్డు ఒక్కరోజులో బద్దలు

దిశ, నేషనల్ బ్యూరో : సుప్రీంకోర్టు మరో చరిత్ర సృష్టించింది.

Update: 2024-01-19 15:25 GMT

దిశ, నేషనల్ బ్యూరో : సుప్రీంకోర్టు మరో చరిత్ర సృష్టించింది. ఒకే రోజు 11 మంది మహిళా న్యాయవాదులకు సీనియర్ అడ్వకేట్ హోదాను కల్పించడం ద్వారా ఇంకో ఘనతను సొంతం చేసుకుంది. గత 75 ఏళ్లలో కేవలం 12 మంది మహిళా న్యాయవాదులకు మాత్రమే సీనియర్ అడ్వకేట్ హోదాను దేశ సర్వోన్నత న్యాయస్థానం మంజూరు చేసింది. ఒకే ఒక్క రోజులో(శుక్రవారం) ఆ రికార్డును తిరగరాసింది. భారత ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్ నేతృత్వంలో మొత్తం 56 మందికి సీనియర్ అడ్వకేట్ హోదాను కల్పించగా.. వారిలో 11 మంది మహిళా న్యాయవాదులు, 34 మంది మొదటి తరం న్యాయవాదులు ఉన్నారు. సీనియర్ అడ్వకేట్ హోదాను పొందిన 11 మంది మహిళా న్యాయవాదుల జాబితాలో శోభా గుప్తా, స్వరూపమ చతుర్వేది, లిజ్ మాథ్యూ, కరుణ నూందీ, ఉత్తరా బబ్బర్, హరిప్రియ పద్మనాభన్, అర్చన పాఠక్ దవే, షిరిన్ ఖజురియా, ఎన్ఎస్ నప్పినై, ఎస్.జనని, నిషా బాగ్చి ఉన్నారు. మొదటి తరం లాయర్లలో అమిత్ ఆనంద్ తివారీ, సౌరభ్ మిశ్రా, అభినవ్ ముఖర్జీ ఉన్నారు. శుక్రవారం జరిగిన సుప్రీంకోర్టు ఫుల్ కోర్ట్ సమావేశంలో దీనిపై నిర్ణయం ప్రకటించారు.

Tags:    

Similar News