వడదెబ్బకు 16 మంది పోలింగ్ సిబ్బంది బలి

ఉత్తర భారతదేశంలోభానుడు భగ్గుమంటున్నాడు. ఢిల్లీ, బిహార్, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్ సహా పలు రాష్ట్రాల్లో వడగాలుల తీవ్రత పెరిగిపోయింది.

Update: 2024-05-31 16:22 GMT

దిశ, నేషనల్ బ్యూరో: ఉత్తర భారతదేశంలోభానుడు భగ్గుమంటున్నాడు. ఢిల్లీ, బిహార్, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్ సహా పలు రాష్ట్రాల్లో వడగాలుల తీవ్రత పెరిగిపోయింది. పలు రాష్ట్రాల్లో పోలింగ్ సిబ్బంది పిట్టల్లా రాలిపోతున్నారు. బిహార్ లో 24 గంటల్లోనే వడదెబ్బతో 14 మంది చనిపోయినట్లు అధికారులు తెలిపారు. అందులో 10 మంది పోలింగ్ సిబ్బందే ఉన్నారు. అత్యధికంగా భోజ్ పూర్ లో ఐదుగురు పోలింగ్ అధికారులు హీట్ స్ట్రోక్ తో చనిపోయారు. రోహ్తాస్ లో ముగ్గురు పోలింగ్ సిబ్బంది, కైమూర్, ఔరంగాబాద్ లో ఒక్కొక్కరు చనిపోయారు. మరో నలుగురు సామాన్యులు చనిపోయినట్లు బిహార్ డిజాస్టర్ మేనేజ్ మెంట్ తెలిపింది. ఉత్తరప్రదేశ్ లోని మీర్జాపూర్ లో ఎన్నికల విధుల్లో ఉన్న ఆరుగురు హోంగార్డులు వడదెబ్బతో చనిపోయారు. హీట్ స్ట్రోక్ తో 23 మంది మీర్జాపూర్ మెడికల్ కాలేజ్ హాస్పిటల్ లో చేరగా అందులో ఆరుగురు చనిపోయారు. ప్రస్తుతం మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందని డాక్టర్లు తెలిపారు. రాజస్థాన్ లోని కోటాలో గతవారం 27 మంది చనిపోయారు. అయితే, వారందరూ వడదెబ్బతోనే చనిపోయినట్లు అధికారులు అనుమానిస్తున్నారు. ఇకపోతే, రాజస్థాన్ అధికారిక లెక్కల ప్రకారం ఇప్పటివరకు ఐదుగురు హీట్ స్ట్రోక్ తో చనిపోయారు. వడదెబ్బ మరణాలను రాజస్థాన్ హైకోర్టు సుమోటో కేసుగా స్వీకరించింది. వడగాలుల పరిస్థితిని జాతీయ అత్యవసర పరిస్థితిగా ప్రకటించాలని కోరింది. బాధిత కుటుంబాలకు పరిహారం చెల్లించాలని రాజస్థాన్ ప్రభుత్వానికి సూచించింది.


Similar News