పాకిస్తాన్‌తో టీ20 సిరీస్‌కు ఇంగ్లాండ్ జట్టు ప్రకటన
దిశ, స్పోర్ట్స్ : పాకిస్తాన్ జట్టుతో ఆగస్టు 28 నుంచి ప్రారంభం కానున్న మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌కు 14 మందితో కూడిన జట్టును ఇంగ్లాండ్-వేల్స్ క్రికెట్ బోర్డు ప్రకటించింది. ఇయాన్ మోర్గాన్ నేతృత్వంలోని ఈ జట్టులో ఎవరైనా గాయపడితే వారి స్థానం భర్తీ చేందుకు ముగ్గురు రిజర్వ్ ఆటగాళ్లను కూడా బోర్డు ఎంపిక చేసింది. ప్రస్తుతం పాకిస్తాన్‌తో టెస్ట్ మ్యాచ్ ఆడుతున్న జట్టులోని ఎవరికీ టీ20ల్లో స్థానం కల్పించలేదని సెలెక్టర్ ఎడ్ స్మిత్ పేర్కొన్నారు. మూడు […]
దిశ, స్పోర్ట్స్ : పాకిస్తాన్ జట్టుతో ఆగస్టు 28 నుంచి ప్రారంభం కానున్న మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌కు 14 మందితో కూడిన జట్టును ఇంగ్లాండ్-వేల్స్ క్రికెట్ బోర్డు ప్రకటించింది. ఇయాన్ మోర్గాన్ నేతృత్వంలోని ఈ జట్టులో ఎవరైనా గాయపడితే వారి స్థానం భర్తీ చేందుకు ముగ్గురు రిజర్వ్ ఆటగాళ్లను కూడా బోర్డు ఎంపిక చేసింది.
ప్రస్తుతం పాకిస్తాన్‌తో టెస్ట్ మ్యాచ్ ఆడుతున్న జట్టులోని ఎవరికీ టీ20ల్లో స్థానం కల్పించలేదని సెలెక్టర్ ఎడ్ స్మిత్ పేర్కొన్నారు. మూడు ఫార్మాట్లలో ఆడే ఆటగాళ్లకు విశ్రాంతినివ్వాలనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన తెలిపారు. ఇక ఇంగ్లాండ్ అసిస్టెంట్ కోచ్ గ్రాహం తోర్ప్.. టీ20 సిరీస్‌కు ప్రధాన కోచ్‌గా బాధ్యతలు నిర్వర్తించనున్నారు. పాల్ కాలింగ్ వుడ్ అసిస్టెంట్ కోచ్‌గా, మార్కస్ ట్రెస్కోతిక్ బ్యాటింగ్ కోచ్‌గా నియమితులయ్యారు.
ఇంగ్లాండ్ జట్టు :
ఇయాన్ మోర్గాన్ (కెప్టెన్), మొయిన్ అలీ, జోనాతాన్ బారిస్ట్రో, టామ్ బాంటన్, సామ్ బిల్లింగ్స్, టామ్ కర్రన్, జో డెన్లీ, లూయీస్ గ్రెగొరీ, క్రిస్ జోర్డాన్, షకీబ్ మహమూద్, డేవిడ్ మలాన్, ఆదిల్ రషీద్, జేసన్ రాయ్, డేవిడ్ విల్లే.
రిజర్వ్ ఆటగాళ్లు:
పాట్ బ్రౌన్, లియామ్ లివింగ్‌స్టోన్, రీస్ టోప్లే