హోంమంత్రి మేకతోటి సుచరిత కులంపై ఎస్సీ కమిషన్ విచారణ

దిశ, ఏపీ బ్యూరో: రాష్ట్ర హోంశాఖమంత్రి మేకతోటి సుచరిత వివాదంలో చిక్కుకున్నారు. మేకతోటి సుచరిత ఎస్సీ కాదంటూ లీగల్ రైట్స్ ప్రొటెక్షన్ ఫోరం జాతీయ ఎస్సీ కమిషన్‌లో ఫిర్యాదు చేసింది. గతంలో ఓ ఇంటర్వ్యూలో ఆమె తాను క్రిస్టియన్‌ అని స్వయంగా ప్రకటించిందని ఫోరం ఆరోపించింది. ఎస్సీ రిజర్వేషన్‌ను సుచరిత దుర్వినియోగం చేస్తున్నారని ఫోరం ఫిర్యాదులో పేర్కొంది. ఫిర్యాదుపై జాతీయ ఎస్సీ కమిషన్ స్పందించింది. వారం రోజుల్లోగా ఈ ఫిర్యాదుపై వివరాలు పంపాలని గుంటూరు జిల్లా కలెక్టర్‌ […]

Update: 2021-08-27 09:26 GMT

దిశ, ఏపీ బ్యూరో: రాష్ట్ర హోంశాఖమంత్రి మేకతోటి సుచరిత వివాదంలో చిక్కుకున్నారు. మేకతోటి సుచరిత ఎస్సీ కాదంటూ లీగల్ రైట్స్ ప్రొటెక్షన్ ఫోరం జాతీయ ఎస్సీ కమిషన్‌లో ఫిర్యాదు చేసింది. గతంలో ఓ ఇంటర్వ్యూలో ఆమె తాను క్రిస్టియన్‌ అని స్వయంగా ప్రకటించిందని ఫోరం ఆరోపించింది. ఎస్సీ రిజర్వేషన్‌ను సుచరిత దుర్వినియోగం చేస్తున్నారని ఫోరం ఫిర్యాదులో పేర్కొంది. ఫిర్యాదుపై జాతీయ ఎస్సీ కమిషన్ స్పందించింది.

వారం రోజుల్లోగా ఈ ఫిర్యాదుపై వివరాలు పంపాలని గుంటూరు జిల్లా కలెక్టర్‌ వివేక్ యాదవ్‌ను ఆదేశించింది. హోంమంత్రి మేకతోటి సుచరిత గుంటూరు జిల్లా ప్రత్తిపాడు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఎన్నికల అఫిడవిట్లో ఎస్సీ అని పేర్కొన్నారు. దీనిపై గతంలోనూ ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే. సుచరిత కాంగ్రెస్ పార్టీ హయాంలోనూ ఎమ్మెల్యేగా గెలుపొందారు. తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోనూ ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2019లో వైసీపీ అధికారంలోకి రావడంతో జగన్ కేబినెట్‌లో హోంమంత్రిగా అవకాశం దక్కించుకున్నారు.

Tags:    

Similar News