కుప్ప కూలిన జాతీయ రహదారి.. వీడియో వైరల్
ఈటానగర్: ఈశాన్య రాష్ట్రం అరుణాచల్ ప్రదేశ్‌లో రెండు రోజులుగా కొడుతున్న వర్షాలు విధ్వంసాన్ని సృష్టిస్తున్నాయి. తాజాగా, రాష్ట్ర రాజధాని ఈటానగర్‌లో కొండప్రాంతాన్ని ఆనుకుని నిర్మించిన జాతీయ రహదారి 415 ఉన్నపళంగా కూలిపోయింది. లోతట్టు ప్రాంతానికి రోడ్డులో బయటి వైపున్న భాగం విరిగిపడింది. భీతిగొల్పుతున్న ఈ వీడియో ప్రస్తుతం వైరల్ అవుతున్నది. నహర్‌లగున్, ఈటానగర్‌లను కలుపుతూ ఈ హైవేను ఇటీవలే నిర్మించారు. ఈటానగర్‌లో డీ సెక్టార్ దగ్గరలోని ఇందిరాపార్క్ వద్ద ఒకవైపు కారులు వెళ్తుండగా మరోవైపు ఆకస్మికంగా కూలిపోయింది. […]
ఈటానగర్: ఈశాన్య రాష్ట్రం అరుణాచల్ ప్రదేశ్‌లో రెండు రోజులుగా కొడుతున్న వర్షాలు విధ్వంసాన్ని సృష్టిస్తున్నాయి. తాజాగా, రాష్ట్ర రాజధాని ఈటానగర్‌లో కొండప్రాంతాన్ని ఆనుకుని నిర్మించిన జాతీయ రహదారి 415 ఉన్నపళంగా కూలిపోయింది. లోతట్టు ప్రాంతానికి రోడ్డులో బయటి వైపున్న భాగం విరిగిపడింది. భీతిగొల్పుతున్న ఈ వీడియో ప్రస్తుతం వైరల్ అవుతున్నది. నహర్‌లగున్, ఈటానగర్‌లను కలుపుతూ ఈ హైవేను ఇటీవలే నిర్మించారు. ఈటానగర్‌లో డీ సెక్టార్ దగ్గరలోని ఇందిరాపార్క్ వద్ద ఒకవైపు కారులు వెళ్తుండగా మరోవైపు ఆకస్మికంగా కూలిపోయింది. అటువైపుగా వెళ్తున్న కారు వాహనదారులు ఏం జరుగుతున్నదోనని కాస్త నెమ్మదించి వెంటనే వేగం పెంచి ప్రయాణాన్ని కొనసాగించారు. ఈ ఘటనలో ప్రాణనష్టం జరగలేదు.
National High way in Arunachal Pradesh washed away due to rains-Media and Government,This is not due to heavy rains don’t blame environment on all your Goos bribe is the result of this consequences has to fall @BJP4India #7YearsOfSeva pic.twitter.com/xe3iI46SSo
— HM Jyothish (@hmjyothish14) June 1, 2021