ఇండియాకు రానున్న 9వ శతాబ్దపు నటరాజ విగ్రహం..
దిశ, వెబ్ డెస్క్ : ఇండియాలోకి ప్రాచీన ఆలయాలకు చెందిన సంపద ఒకప్పుడు దోపిడికి గురైంది. మరికొన్ని ఆలయాలు అందులోని విలువైన విగ్రహాలు ధ్వంసం చేయబడ్డాయి. ఈ క్రమంలోనే రాజస్తాన్‌లోని బరౌలీలో ఉన్న గల ఘటేశ్వరాలయం నుంచి 1998లో కొందరు స్మగ్లర్లు నటరాజ విగ్రహాన్ని దొంగిలించారు. దీనిని వారు బ్రిటన్‌కు స్మగుల్ చేశారన్న విషయం 2003నాటికి గానీ తెలీలేదు. అయితే ఈ అరుదైన తొమ్మిదో శతాబ్దానికి చెందిన ఈ నటరాజ విగ్రహం నాలుగు అడుగుల ఎత్తు ఉంది. […]
దిశ, వెబ్ డెస్క్ :
ఇండియాలోకి ప్రాచీన ఆలయాలకు చెందిన సంపద ఒకప్పుడు దోపిడికి గురైంది. మరికొన్ని ఆలయాలు అందులోని విలువైన విగ్రహాలు ధ్వంసం చేయబడ్డాయి. ఈ క్రమంలోనే రాజస్తాన్‌లోని బరౌలీలో ఉన్న గల ఘటేశ్వరాలయం నుంచి 1998లో కొందరు స్మగ్లర్లు నటరాజ విగ్రహాన్ని దొంగిలించారు. దీనిని వారు బ్రిటన్‌కు స్మగుల్ చేశారన్న విషయం 2003నాటికి గానీ తెలీలేదు.
అయితే ఈ అరుదైన తొమ్మిదో శతాబ్దానికి చెందిన ఈ నటరాజ విగ్రహం నాలుగు అడుగుల ఎత్తు ఉంది. చోరీ విషయాన్ని ఇండియన్ ఎంబస్సీ అధికారులు లండన్ కార్యాలయానికి తెలియజేయగా.. అక్కడి ఓ ప్రయివేటు వ్యక్తి ఒకరు 2005లో భారత హైకమిషన్‌కు తిరిగి ఇచ్చారు.
2017 ఆగస్టులో భారత పురావస్తు అధికారుల బృందం లండన్‌లోని ఇండియా హౌస్‌ను సందర్శించగా.. అది ఘటేశ్వరాలయం నుంచి దొంగిలించబడినదే అని నిర్దారించారు.దీంతో ఆ విగ్రహం త్వరలోనే ఇండియాకు రానుంది. ఇదేగాక ఇండియా నుంచి స్మగుల్ అయిన వివిధ దేవతా మూర్తుల విగ్రహాలు అమెరికా, జర్మనీ, ఆస్ట్రేలియా, ఫ్రాన్స్ వంటి దేశాలకు చేరగా ఆయా దేశాలు వాటిని భారత్‌కు తిరిగి అప్పగించాయి.