భారత ఇంజనీరింగ్ ఆర్అండ్‌డీ పరిశ్రమపై నాస్కామ్ కీలక ప్రకటన

దిశ, వెబ్‌డెస్క్: అంతర్జాతీయంగా ఇంజనీరింగ్ పరిశోధన, అభివృద్ధి(ఈఆర్అండ్‌డీ) మార్కెట్లో భారత్ వాటా 12-13 శాతం వార్షిక వృద్ధితో 2025 నాటికి 63 బిలియన్ డాలర్లు(రూ. 4.6 లక్షల కోట్లు) చేరుకుంటుందని పరిశ్రమల సంస్థ నాస్కామ్ వెల్లడించింది. నాస్కామ్ ఇంజనీరింగ్ ఆర్అండ్‌డీ షోకేస్-2021 కార్యక్రమంలో నాస్కామ్ అధ్యక్షులు దేబ్జని ఘోష్ మాట్లాడుతూ.. కరోనా మహమ్మారి తర్వాత వినియోగదారుల పద్ధతులు, వారు కంపెనీలతో మాట్లాడే విధానం, వ్యాపార నిర్వహణలో అనేక మార్పులు జరిగాయి. దీనికి తగినట్టుగానే కాంటాక్ట్‌లెస్ టెక్నాలజీ, అనాలిటిక్స్, […]

Update: 2021-06-25 07:13 GMT

దిశ, వెబ్‌డెస్క్: అంతర్జాతీయంగా ఇంజనీరింగ్ పరిశోధన, అభివృద్ధి(ఈఆర్అండ్‌డీ) మార్కెట్లో భారత్ వాటా 12-13 శాతం వార్షిక వృద్ధితో 2025 నాటికి 63 బిలియన్ డాలర్లు(రూ. 4.6 లక్షల కోట్లు) చేరుకుంటుందని పరిశ్రమల సంస్థ నాస్కామ్ వెల్లడించింది. నాస్కామ్ ఇంజనీరింగ్ ఆర్అండ్‌డీ షోకేస్-2021 కార్యక్రమంలో నాస్కామ్ అధ్యక్షులు దేబ్జని ఘోష్ మాట్లాడుతూ.. కరోనా మహమ్మారి తర్వాత వినియోగదారుల పద్ధతులు, వారు కంపెనీలతో మాట్లాడే విధానం, వ్యాపార నిర్వహణలో అనేక మార్పులు జరిగాయి. దీనికి తగినట్టుగానే కాంటాక్ట్‌లెస్ టెక్నాలజీ, అనాలిటిక్స్, సాఫ్ట్‌వేర్ వ్యవస్థలు ఉత్పత్తుల రీ-డిజైన్, ఇంజనీరింగ్, వినియోగంలో మార్పు చేస్తున్నాయి. ఈ పరిణామాలు భరత్‌లోని ఇంజనీరింగ్ ఆర్అండ్‌డీ కంపెనీలకు, ప్రధానంగా అంతర్జాతీయ సంస్థలతో భాగస్వామ్యం కలిగి ఉండేందుకు, భవిష్యత్తు ఇంజనీరింగ్ ఉత్పత్తిల్లో డిజైన్, ఆవిష్కరణలకు కీలక అవకాశం. ఇది పరిశ్రమ భవిష్యత్తును మారుస్తుందని ఆశిస్తున్నట్టు’ ఆమె వివరించారు. 2019లో 31 బిలియన్ డాలర్లు(రూ. 2.3 లక్షల కోట్లు) ఉన్న ఈ పరిశ్రమ 2025 నాటికి రూ. 4.6 లక్షల కోట్లకు చేరుకుంటుంది. ఈ వృద్ధి ఆటోమోటివ్, ఏరోస్పేస్, కన్జ్యూమర్ ఎలక్ట్రానిక్స్, మెడికల్ డివైజెస్, ఇండస్ట్రియల్ ఎనర్జీ, సెమీకండక్టర్, టెలికాం వంటి రంగాల్లో ఇంజనీరింగ్ ఆర్అండ్‌డీ సామర్థ్యాన్ని పెంచుతుందని ఆమె వెల్లడించారు.

Tags:    

Similar News