నాసా ఆధ్వర్యంలో రెండు ఆస్ట్రోనాట్ మిషన్స్‌

దిశ, ఫీచర్స్ : అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం(ఐఎస్‌ఎస్)కు రెండు కొత్త ఆస్ట్రోనాట్ మిషన్లను పంపించేందుకు అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసా వాణిజ్య సంస్థల నుంచి ప్రతిపాదనలు కోరింది. ఇందులో భాగంగా మొదటి మిషన్ 2022-23 మధ్యన చేపట్టనుండగా.. 2023 చివరినాటికి రెండో మిషన్‌ను నిర్వహించనుంది. కమర్షియల్ లో ఎర్త్ ఆర్బిట్(ఎల్‌ఈవో) డెవలప్‌మెంట్‌లో భాగంగా నాసా.. ప్రైవేట్ ఆస్ట్రోనాట్ మిషన్లను పంపించేందుకు చొరవ చూపుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే చాలా దేశాలకు సంబంధించిన అంతరిక్ష సంస్థలు వారి […]

Update: 2021-06-12 09:03 GMT

దిశ, ఫీచర్స్ : అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం(ఐఎస్‌ఎస్)కు రెండు కొత్త ఆస్ట్రోనాట్ మిషన్లను పంపించేందుకు అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసా వాణిజ్య సంస్థల నుంచి ప్రతిపాదనలు కోరింది. ఇందులో భాగంగా మొదటి మిషన్ 2022-23 మధ్యన చేపట్టనుండగా.. 2023 చివరినాటికి రెండో మిషన్‌ను నిర్వహించనుంది.

కమర్షియల్ లో ఎర్త్ ఆర్బిట్(ఎల్‌ఈవో) డెవలప్‌మెంట్‌లో భాగంగా నాసా.. ప్రైవేట్ ఆస్ట్రోనాట్ మిషన్లను పంపించేందుకు చొరవ చూపుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే చాలా దేశాలకు సంబంధించిన అంతరిక్ష సంస్థలు వారి దేశాల నుంచి ISSకు వ్యోమగాములను పంపించేందుకు సన్నాహకాలు చేపట్టాయి. అందులో భాగంగా హ్యూస్టన్‌కు చెందిన ‘ఆక్సియం’ స్టార్టప్‌కు జనవరి 2022న అంతరిక్షానికి మొదటి ప్రైవేట్ ఆస్ట్రోనాట్ మిషన్‌ను పంపేందుకు అవకాశం లభించింది.

ఈ ఎనిమిది రోజుల స్పేస్ ట్రిప్‌ కోసం ఫ్లోరిడాలోని కెన్నెడీ స్పేస్ సెంటర్ నుండి నలుగురు ప్రైవేట్ వ్యోమగాములను తీసుకెళ్లనుంది. ఈ మిషన్‌కు సంబంధించిన సేవల కోసం నాసా.. ఆక్సియం సంస్థకు 1.69 మిలియన్ డాలర్లను చెల్లించనుంది. ఇక నాసా చేపట్టబోయే ఒక్కో మిషన్ 14 రోజుల వరకు ఉండనుండగా.. జూలై 9 నాటికి ప్రతిపాదనలు పంపాలి. కాగా ఈ మిషన్స్‌ను‌ యూఎస్ కంపెనీ మధ్యవర్తిత్వం వహించాలని తెలిపిన ఏజెన్సీ.. యూఎస్ ట్రాన్స్‌పోర్టేషన్ ఆమోదించిన స్పేస్‌క్రాఫ్ట్‌నే ఉపయోగించాలని పేర్కొంది.

 

Tags:    

Similar News