నాసా హెడ్‌క్వార్టర్‌కు నల్లజాతీయురాలి పేరు!

అమెరికాలో నల్లజాతీయుల మీద చూపిస్తున్న వివక్ష గురించి ప్రస్తుతం చాలా ఆందోళనలు జరుగుతున్న సంగతి విదితమే. ఇలాంటి టైమ్‌లో నాసా చేసిన ఒక పని అందరి మన్ననలు పొందుతోంది. తమ వాషింగ్టన్ డీసీ హెడ్‌క్వార్టర్‌కు తమ మొదటి నల్లజాతికి చెందిన ఇంజినీర్ మేరీ జాక్సన్ పేరు పెడుతున్నట్లు అమెరికా అంతరిక్ష పరిశోధనా కేంద్రం ప్రకటించింది. అమెరికా వ్యోమగాములను అంతరిక్షం వరకు చేర్చడంలో మేరీ జాక్సన్ పాత్రను గుర్తుచేసుకుంటూ తాము ఈ నిర్ణయం తీసుకున్నట్లు నాసా తెలిపింది. తరతరాల […]

Update: 2020-06-25 05:14 GMT
నాసా హెడ్‌క్వార్టర్‌కు నల్లజాతీయురాలి పేరు!
  • whatsapp icon

అమెరికాలో నల్లజాతీయుల మీద చూపిస్తున్న వివక్ష గురించి ప్రస్తుతం చాలా ఆందోళనలు జరుగుతున్న సంగతి విదితమే. ఇలాంటి టైమ్‌లో నాసా చేసిన ఒక పని అందరి మన్ననలు పొందుతోంది. తమ వాషింగ్టన్ డీసీ హెడ్‌క్వార్టర్‌కు తమ మొదటి నల్లజాతికి చెందిన ఇంజినీర్ మేరీ జాక్సన్ పేరు పెడుతున్నట్లు అమెరికా అంతరిక్ష పరిశోధనా కేంద్రం ప్రకటించింది. అమెరికా వ్యోమగాములను అంతరిక్షం వరకు చేర్చడంలో మేరీ జాక్సన్ పాత్రను గుర్తుచేసుకుంటూ తాము ఈ నిర్ణయం తీసుకున్నట్లు నాసా తెలిపింది.

తరతరాల నుంచి గుర్తింపుకు నోచుకోకుండా మరుగున పడిపోయిన వారిని గుర్తుచేసుకునేందుకు నాసా ఇప్పుడు ప్రయత్నిస్తోందని, వారికి ఇప్పుడైనా గౌరవాన్ని అందిస్తామని అడ్మినిస్ట్రేటర్ జిమ్ బ్రిడెన్‌స్టీన్ తెలిపారు. దీనికి వారు ‘హిడెన్ ఫిగర్స్ వే’ అని పేరు కూడా పెట్టారు. నాసా విజయాల్లో భాగమై మరుగున పడిన వారికి ఇందులో భాగంగా గౌరవాన్ని అందించనున్నారు. కాగా తన తల్లికి అరుదైన గౌరవాన్ని ఇచ్చినందుకు జాక్సన్ కూతురు కారోలిన్ లూయిస్ సంతోషం వ్యక్తం చేశారు.

హ్యాంప్టన్, వర్జీనియాలో జాక్సన్ జన్మించారు. హ్యాంప్టన్ యూనివర్సిటీ నుంచి 1942లో గణితం, భౌతిక శాస్త్రాల్లో ఆమె పట్టా పొందారు. 1951లో నాసాకు ముందున్న నేషనల్ అడ్వైజరీ కమిటీ ఫర్ ఎరోనాటిక్స్‌లో ఆమె పని ప్రారంభించారు. ప్రస్తుతం అదే లాంగ్లీ రీసెర్చి సెంటర్‌గా మారింది. 1958లో నాసా వారి సూపర్‌సోనిక్ ప్రెషర్ టన్నెల్ డిజైనింగ్‌లో పనిచేసిన నల్లజాతికి చెందిన మొదటి మహిళా ఇంజినీర్‌గా జాక్సన్ నిలిచారు. 1985లో నాసా నుంచి రిటైరయ్యాక 2005లో ఆమె మరణించారు.

Tags:    

Similar News