జగన్ మూర్ఖత్వానికి ఇదే నిదర్శనం : నారా లోకేష్
దిశ, వెబ్‌డెస్క్ : ఏపీలో కరోనా కేసులు తీవ్రరూపం దాల్చాయి. ఒక్కరోజు వ్యవధిలో రెట్టింపు సంఖ్యలో కేసులు నమోదవుతున్నాయి. అయితే, రాష్ట్రంలో పది, ఇంటర్ పరీక్షలు సమీపిస్తున్నందున విద్యార్థులు, వారి తల్లిదండ్రులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. మే నెల మొదటి వారంలో జరిగే పరీక్షలపై మాజీ మంత్రి, టీడీపీ నాయకుడు నారాలోకేష్ స్పందించారు. బయట కరోనా మహమ్మారి విస్తరిస్తున్నందున విద్యార్థుల ప్రాణాలతో చెలగాటం ఆడొద్దని ఏపీ ప్రభుత్వానికి సూచించారు. దేశవ్యాప్తంగా సీబీఎస్‌ఈ పది, ఇంటర్ పరీక్షలను రద్దు […]
దిశ, వెబ్‌డెస్క్ : ఏపీలో కరోనా కేసులు తీవ్రరూపం దాల్చాయి. ఒక్కరోజు వ్యవధిలో రెట్టింపు సంఖ్యలో కేసులు నమోదవుతున్నాయి. అయితే, రాష్ట్రంలో పది, ఇంటర్ పరీక్షలు సమీపిస్తున్నందున విద్యార్థులు, వారి తల్లిదండ్రులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. మే నెల మొదటి వారంలో జరిగే పరీక్షలపై మాజీ మంత్రి, టీడీపీ నాయకుడు నారాలోకేష్ స్పందించారు. బయట కరోనా మహమ్మారి విస్తరిస్తున్నందున విద్యార్థుల ప్రాణాలతో చెలగాటం ఆడొద్దని ఏపీ ప్రభుత్వానికి సూచించారు.
దేశవ్యాప్తంగా సీబీఎస్‌ఈ పది, ఇంటర్ పరీక్షలను రద్దు చేయగా, తెలంగాణ ప్రభుత్వం సైతం పదొ తరగతి , ఇంటర్ ఫస్ట్ ఇయర్ పరీక్షలను రద్దు చేసిన విషయం తెలిసిందే. అదే విధంగా ఏపీలోనూ పది, ఇంటర్ పరీక్షలను రద్దు చేయాలని వైసీపీ ప్రభుత్వాన్ని నారా లోకేష్ డిమాండ్ చేశారు. పరీక్షలపై ఓ నిర్ణయం తీసుకోకపోవడం సీఎం జగన్ మూర్ఖత్వానికి నిదర్శమని అన్నారు.