ప్రాణాలు పోతున్నాయి నిర్లక్ష్యం వీడరా?
దిశ, వెబ్‌డెస్క్: కరోనా వైరస్, పేషంట్లపై ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోందని టీడీపీ నేత నారా లోకేశ్ అన్నారు. సోమవారం తన ట్విట్టర్ ఓ కరోనా బాధితుడి వీడియో షేర్ చేసిన లోకేశ్ ప్రభుత్వంపై విమర్శలు చేశారు. సీఎం జగన్ చెబుతున్న దానికి క్షేత్ర స్థాయిలో జరుగుతున్న దానికి పొంతన లేదని చెప్పారు. క్వారంటైన్ సెంటర్లలో సదుపాయాలు బాలేదని.. కొవిడ్ ఆస్పత్రుల్లో సరైన వైద్యం అందడం లేదని ఏకంగా బాధితులు చెబుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని దుయ్యబట్టారు. కాగా, […]
దిశ, వెబ్‌డెస్క్: కరోనా వైరస్, పేషంట్లపై ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోందని టీడీపీ నేత నారా లోకేశ్ అన్నారు. సోమవారం తన ట్విట్టర్ ఓ కరోనా బాధితుడి వీడియో షేర్ చేసిన లోకేశ్ ప్రభుత్వంపై విమర్శలు చేశారు. సీఎం జగన్ చెబుతున్న దానికి క్షేత్ర స్థాయిలో జరుగుతున్న దానికి పొంతన లేదని చెప్పారు. క్వారంటైన్ సెంటర్లలో సదుపాయాలు బాలేదని.. కొవిడ్ ఆస్పత్రుల్లో సరైన వైద్యం అందడం లేదని ఏకంగా బాధితులు చెబుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని దుయ్యబట్టారు. కాగా, ఈ రోజు శ్రీకాకుళం జిల్లాకు చెందిన ఓ కరోనా బాధితుడు కొవిడ్ ఆస్పత్రిలో సరైన వైద్యం అందడం లేదని, తన ప్రాణాలు కాపాడాలని ఓ సెల్ఫీ వీడియో ద్వారా వేడుకున్నాడు. ఈ వీడియోపై జిల్లా అధికారులు స్పందించినట్లు తెలుస్తోంది. అయితే, ఈ వీడియోను తన ట్విట్టర్ అకౌంట్‌లో షేర్ చేసిన లోకేశ్ ప్రజల ప్రాణాలు పోతున్నా పాలకులు నిర్లక్ష్యం వీడరా అంటూ ట్వీట్ చేశారు.
.@ysjagan గారు చెబుతున్న దానికి క్షేత్ర స్థాయిలో జరుగుతున్న దానికి అసలు పొంతన లేదు. క్వారంటైన్ సెంటర్ల లో సదుపాయాలు బాలేదని,కోవిడ్ ఆసుపత్రుల్లో సరైన వైద్యం అందటం లేదని బాధితులు చెబుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు.(1/2) pic.twitter.com/g72NTiiZui
— Lokesh Nara #StayHomeSaveLives (@naralokesh) July 20, 2020