రైతులను ఆదుకోవడంలో ప్రభుత్వం విఫలం
దిశ, వెబ్డెస్క్ : అకాల వర్షాలు, వరదల వల్ల నష్టపోయిన రైతులను ఆదుకోవడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని టీడీపీ నేత నారా లోకేష్ విమర్శించారు. వరద ప్రభావిత ఐదు జిల్లాల్లో పర్యటించానని.. బాధితులకు వరద సాయం, ప్యాకేజీ ఎక్కడా అందలేదన్నారు. ఫైబర్ గ్రిడ్, ఇన్సైడర్ ట్రేడింగ్ కేసు అంటూ.. చివరికి తనపై ట్రాక్టర్ ర్యాష్ డ్రైవింగ్ కేసు పెట్టారని తెలిపారు. స్ధానిక సంస్థల ఎన్నికలకు టీడీపీ సిద్ధంగా ఉందని లోకేష్ స్పష్టం చేశారు. కొత్త నోటిఫికేషన్ […]
దిశ, వెబ్డెస్క్ : అకాల వర్షాలు, వరదల వల్ల నష్టపోయిన రైతులను ఆదుకోవడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని టీడీపీ నేత నారా లోకేష్ విమర్శించారు. వరద ప్రభావిత ఐదు జిల్లాల్లో పర్యటించానని.. బాధితులకు వరద సాయం, ప్యాకేజీ ఎక్కడా అందలేదన్నారు. ఫైబర్ గ్రిడ్, ఇన్సైడర్ ట్రేడింగ్ కేసు అంటూ.. చివరికి తనపై ట్రాక్టర్ ర్యాష్ డ్రైవింగ్ కేసు పెట్టారని తెలిపారు.
స్ధానిక సంస్థల ఎన్నికలకు టీడీపీ సిద్ధంగా ఉందని లోకేష్ స్పష్టం చేశారు. కొత్త నోటిఫికేషన్ ఇవ్వాలని కోరుతున్నామని అన్నారు. ఇళ్ల స్థలాలపై కోర్టుకు టీడీపీ ఎక్కడ వెళ్లిందో బొత్స చెప్పాలని డిమాండ్ చేశారు.