అర్చకులను తోసుకుంటూ… ఆలయంలోకి బీజేపీ నేత
దిశ, వెబ్‌డెస్క్: బీజేపీ నంద్యాల పార్లమెంట్ ఇన్‌చార్జి శ్రీకాంత్ రెడ్డి అర్చకుల పట్ల దురుసుగా ప్రవర్తించారు. శనివారం ఆయన కర్నూలు జిల్లాలోని సుప్రసిద్ధ ఆలయం మహానందిని సందర్శించారు. ఈ క్రమంలో శ్రీకాంత్ రెడ్డి అర్చకులను తోసుకుంటూ గర్భాలయంలోకి ప్రవేశించడం వివాదాస్పదంగా మారింది. అయితే రాష్ట్రంలో కరోనా మహమ్మారి విస్తృతంగా వ్యాప్తిచెందుతుండటంతో దేవాలయాల్లో స్పర్శ దర్శనం, ప్రత్యేక పూజలు నిషేధించారు. అయితే భక్తుల కోరిక మేరకు కరోనా నిబంధనలు పాటిస్తూ గర్భాలయ ప్రవేశం లేని కొన్ని పూజలకు మాత్రమే […]
దిశ, వెబ్‌డెస్క్: బీజేపీ నంద్యాల పార్లమెంట్ ఇన్‌చార్జి శ్రీకాంత్ రెడ్డి అర్చకుల పట్ల దురుసుగా ప్రవర్తించారు. శనివారం ఆయన కర్నూలు జిల్లాలోని సుప్రసిద్ధ ఆలయం మహానందిని సందర్శించారు. ఈ క్రమంలో శ్రీకాంత్ రెడ్డి అర్చకులను తోసుకుంటూ గర్భాలయంలోకి ప్రవేశించడం వివాదాస్పదంగా మారింది. అయితే రాష్ట్రంలో కరోనా మహమ్మారి విస్తృతంగా వ్యాప్తిచెందుతుండటంతో దేవాలయాల్లో స్పర్శ దర్శనం, ప్రత్యేక పూజలు నిషేధించారు.
అయితే భక్తుల కోరిక మేరకు కరోనా నిబంధనలు పాటిస్తూ గర్భాలయ ప్రవేశం లేని కొన్ని పూజలకు మాత్రమే అనుమతి ఇస్తున్నారు. ఈ క్రమంలో తనను ఆలయం లోపలికి ఎందుకు వెళ్లనీయడం లేదంటూ అర్చకులతో వాగ్వాదానికి దిగారు. ఈవో అనుమతి తీసుకొంటే తమకు అభ్యంతరం లేదని అక్కడి అర్చకులు ఆయనకు సమాధానం ఇచ్చారు. అంతేగాకుండా సాయంత్రం మరోసారి కొవిడ్ నిబంధలను బేఖాతారు చేస్తూ శ్రీకాంత్ రెడ్డి గర్భాలయంలోకి ప్రవేశించి దర్శనం చేసుకున్నారు.
ఈ సంఘటనపై ఆలయ ప్రోటోకాల్ ఇన్‌స్పెక్టర్ సురేంద్రనాథరెడ్డి మాట్లాడుతూ.. భాజపా నాయకుడు శ్రీకాంత్ రెడ్డి దురుసుగా ప్రవర్తించి ఆలయ ప్రవేశం చేయడం బాధాకరమన్నారు. దీనిపై శ్రీకాంత్ రెడ్డి స్పందిస్తూ… అర్చకులు, పండితులే తగిన గౌరవాన్ని ఇవ్వకుండా తనపట్ల దురుసుగా వ్యవహరించారని ఆరోపించారు. ఈ ఘటనపై ఇరువురూ పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ విషయాన్ని రాష్ట్ర దేవాదాయ శాఖ కమిషనర్ దృష్టికి తీసుకెళ్లినట్లు ఏఈవో ధనుంజయ్ తెలిపారు.