తల్లీకూతుళ్ల ప్రాణాలు కాపాడిన నల్లగొండ పోలీసులు

దిశ, నల్లగొండ: కుటుంబ కలహాల కారణంగా ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నించిన తల్లీకూతుళ్లను నల్లగొండ టూ టౌన్ పోలీసులు రక్షించారు. వివరాల్లోకి వెళితే… నల్లగొండ టూ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో గుర్రం గాయత్రి కుటుంబంతో పాటు నివాసం ఉంటోంది. మంగళవారం రాత్రి ఇంట్లో కుటుంబసభ్యుల మధ్య జరిగిన తీవ్రరూపం దాల్చడంతో కూతురు గుర్రం శ్రీజతో కలిసి ఆత్మహత్య చేసుకుంటానని ఇంట్లోంచి పరుగులు తీసింది. దీంతో ఆందోళన చెందిన కుటుంబ సభ్యులు పోలీసులకు సమాచారం అందజేశారు. హుటాహుటిన ఘటనా […]

Update: 2021-09-07 10:20 GMT

దిశ, నల్లగొండ: కుటుంబ కలహాల కారణంగా ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నించిన తల్లీకూతుళ్లను నల్లగొండ టూ టౌన్ పోలీసులు రక్షించారు. వివరాల్లోకి వెళితే… నల్లగొండ టూ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో గుర్రం గాయత్రి కుటుంబంతో పాటు నివాసం ఉంటోంది. మంగళవారం రాత్రి ఇంట్లో కుటుంబసభ్యుల మధ్య జరిగిన తీవ్రరూపం దాల్చడంతో కూతురు గుర్రం శ్రీజతో కలిసి ఆత్మహత్య చేసుకుంటానని ఇంట్లోంచి పరుగులు తీసింది. దీంతో ఆందోళన చెందిన కుటుంబ సభ్యులు పోలీసులకు సమాచారం అందజేశారు. హుటాహుటిన ఘటనా స్థలానికి చేరిన పోలీసులు, గాయత్రి సెల్ లొకేషన్ ఆధారంగా లతీఫ్ సాహేబ్ గుట్టపై ఉన్నట్లు గుర్తించారు. అనంతరం వెంటనే అక్కడకు చేరుకొని తల్లీకూతుళ్లను కాపాడారు. వెంటనే అప్రమత్తమై వారిని రక్షించిన డ్యూటీలో ఉన్న పోలీసులను జిల్లా ఎస్పీ ఏవీ. రంగనాథ్, అదనపు ఎస్పీ నర్మద, నల్లగొండ డీఎస్పీ వెంకటేశ్వర్ రెడ్డి, టూ టౌన్ సీఐ చంద్రశేఖర్ రెడ్డి, టూ టౌన్ ఎస్ఐ నర్సింహలు అభినందించారు.

Tags:    

Similar News