యాదయ్య మృతి కరోనాతో కాదు
దిశ ప్రతినిధి, నల్లగొండ: ఇటీవల జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలోని కోవిడ్ ఐసోలేషన్ వార్డ్‌లో చికిత్స పొందుతూ బి.యాదయ్య మృతి చెందిన సంగతి తెలిసిందే. ఈఘటనపై జిల్లా కలెక్టర్ స్పందించారు. ఈ ఘటనలో డాక్టర్లు, వైద్య సిబ్బంది నిర్లక్ష్యం లేదని కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ స్పష్టం చేశారు. వేములపల్లి మండలం సల్కూర్‌కు చెందిన యాదయ్య (40) జూలై 17న తీవ్ర శ్వాస సమస్య, దగ్గు, జ్వరంతో ఆసుపత్రిలో అడ్మిట్ అయినట్లు తెలిపారు. యాదయ్య కోవిడ్‌తో చనిపోలేదని.. అతనికి […]
దిశ ప్రతినిధి, నల్లగొండ: ఇటీవల జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలోని కోవిడ్ ఐసోలేషన్ వార్డ్‌లో చికిత్స పొందుతూ బి.యాదయ్య మృతి చెందిన సంగతి తెలిసిందే. ఈఘటనపై జిల్లా కలెక్టర్ స్పందించారు. ఈ ఘటనలో డాక్టర్లు, వైద్య సిబ్బంది నిర్లక్ష్యం లేదని కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ స్పష్టం చేశారు. వేములపల్లి మండలం సల్కూర్‌కు చెందిన యాదయ్య (40) జూలై 17న తీవ్ర శ్వాస సమస్య, దగ్గు, జ్వరంతో ఆసుపత్రిలో అడ్మిట్ అయినట్లు తెలిపారు. యాదయ్య కోవిడ్‌తో చనిపోలేదని.. అతనికి దీర్ఘకాలంగా శ్వాసకోశ వ్యాధి (సీఓపీడీ), అల్కహాలిక్ లివర్ వ్యాధితో బాధ పడుతున్నారని కలెక్టర్ వెల్లడించారు. ఈ నెల 18న వైద్య సిబ్బంది యాదయ్య శాంపిల్స్ సేకరించి పరీక్షలకు పంపగా రిపోర్ట్‌లో నెగటివ్ వచ్చిందన్నారు.