సాగర్‌కు కొనసాగుతున్న వరద..

దిశ, వెబ్ డెస్క్ : ఎగువన కురస్తున్న వర్షాలతో నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు వరద ఉధృతి ఇంకా కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో 10 క్రస్ట్ గేట్లను 12 అడుగుల మేర ఎత్తి అధికారులు నీటిని దిగువకు విడుదల చేశారు. సాగర్ ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 590.00 అడుగులు కాగా, ప్రస్తుత నీటిమట్టం 589.30 అడుగులకు చేరింది. ప్రస్తుతం ప్రాజెక్టు ఇన్ ఫ్లో, అవుట్ ఫ్లో 2,20,143 క్యూసెక్కులుగా ఉంది. పూర్తిస్థాయి నీటి నిల్వ 312. 0405 టీఎంసీలు […]

Update: 2020-08-26 22:51 GMT

దిశ, వెబ్ డెస్క్ :
ఎగువన కురస్తున్న వర్షాలతో నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు వరద ఉధృతి ఇంకా కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో 10 క్రస్ట్ గేట్లను 12 అడుగుల మేర ఎత్తి అధికారులు నీటిని దిగువకు విడుదల చేశారు. సాగర్ ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 590.00 అడుగులు కాగా, ప్రస్తుత నీటిమట్టం 589.30 అడుగులకు చేరింది.

ప్రస్తుతం ప్రాజెక్టు ఇన్ ఫ్లో, అవుట్ ఫ్లో 2,20,143 క్యూసెక్కులుగా ఉంది. పూర్తిస్థాయి నీటి నిల్వ 312. 0405 టీఎంసీలు కాగా, ప్రస్తుత నీటి నిల్వ 309.9534 టీఎంసీలుగా నమోదయ్యింది. అయితే, ఈ వరద ఉధృతి మరికొన్నిరోజులు ఉండవచ్చునని ఇరిగేషన్ అధికారులు అభిప్రాయం వ్యక్తంచేస్తున్నారు.

Tags:    

Similar News