‘కుక్క కూడా వినదు.. సీఎం వింటున్నారు’

దిశ, వెబ్‌డెస్క్: మంత్రి కొడాలి నాని నోరు గుట్కా, మందుతో ఓపెన్ డ్రైనేజీగా మారిందని టీడీపీ నేత నాదెండ్ల బ్రహ్మం అన్నారు. ఆయన వద్దకు వెళ్లే వారు దూరంగా ఉండాలని.. కొడాలితో కరోనా కంటే పెద్ద వ్యాధి సోకే ప్రమాదం ఉందని వ్యాఖ్యానించారు. సీఎం జగన్ వద్దకు వెళ్లిన కొడాలి నాని.. ‘ అన్న.. సన్నబియ్యం ఇస్తామని చెప్పిన సన్నాసులు ఇవ్వలేదని ప్రజలు గుర్రుగా ఉన్నారు.. ఒక్క రాజధాని కూడా నిర్మించ లేని సన్నాసులు.. మూడు రాజధానులు.. […]

Update: 2020-09-08 04:46 GMT

దిశ, వెబ్‌డెస్క్: మంత్రి కొడాలి నాని నోరు గుట్కా, మందుతో ఓపెన్ డ్రైనేజీగా మారిందని టీడీపీ నేత నాదెండ్ల బ్రహ్మం అన్నారు. ఆయన వద్దకు వెళ్లే వారు దూరంగా ఉండాలని.. కొడాలితో కరోనా కంటే పెద్ద వ్యాధి సోకే ప్రమాదం ఉందని వ్యాఖ్యానించారు.

సీఎం జగన్ వద్దకు వెళ్లిన కొడాలి నాని.. ‘ అన్న.. సన్నబియ్యం ఇస్తామని చెప్పిన సన్నాసులు ఇవ్వలేదని ప్రజలు గుర్రుగా ఉన్నారు.. ఒక్క రాజధాని కూడా నిర్మించ లేని సన్నాసులు.. మూడు రాజధానులు.. 30 రాజధానులంటున్నారు.. ఎలాగు విశాఖ అభివృద్ధి చెందిన పట్టణమే కాబట్టి దానికి వైసీపీ రంగులేసి మనమే నిర్మించామని చెప్పుకుందాం’ అని ఉచిత సలహా ఇచ్చారని నాదెండ్ల బ్రహ్మం ఆరోపించారు.

కానీ, బయటకొచ్చి నేను జగన్‌కు అది చెప్పా.. ఇది చెప్పా అంటూ ప్రగల్భాలు పలికారని ఎద్దేవా చేశారు. కొడాలి నాని చెబితే అతని ఇంట్లో ఉన్న కుక్క కూడా మాట వినదని.. అటువంటిది సీఎం జగన్ వినడం దౌర్బగ్య అన్నారు. కనీసం అటెండర్ కూడా కొడాలి వస్తే లేచి నిలబడడని నాదెండ్ల బ్రహ్మం చురకలు వేశారు.

Tags:    

Similar News