రంగనాయక సాగర్, మల్లన్న సాగర్‌ల నిర్మాణం అద్భుతం.. నాబార్డు చైర్మన్

దిశ, సిద్దిపేట: చిన్నకోడూర్ మండలం చందలపూర్ శివారులోని రంగనాయక సాగర్ రిజర్వాయర్‌ను గురువారం నాబార్డు చైర్మన్ చింతల గోవింద రాజుతో పాటు నాబార్డు సభ్యులు వేంకటేశ విద్యాసాగర్, సీ.మురళీధర్, హారేరామ్, వైకే రావులు సందర్శించారు. రంగనాయక సాగర్ బండ్, సర్జిపుల్ పంప్, టన్నెల్, పల్లగుట్టపై ఉన్న ఇరిగేషన్ ఏస్ఈ కార్యాలయం, గెస్ట్ హౌస్ లపై వివరాలను ప్రాజెక్టు అధికారులను అడిగి తెలుసుకున్నారు. రంగనాయక సాగర్ రిజర్వాయర్ నిర్మాణం అద్భుతంగా ఉందని ప్రశంసించారు. రిజర్వాయర్ ద్వారా కాలంతో పని […]

Update: 2021-12-02 10:02 GMT

దిశ, సిద్దిపేట: చిన్నకోడూర్ మండలం చందలపూర్ శివారులోని రంగనాయక సాగర్ రిజర్వాయర్‌ను గురువారం నాబార్డు చైర్మన్ చింతల గోవింద రాజుతో పాటు నాబార్డు సభ్యులు వేంకటేశ విద్యాసాగర్, సీ.మురళీధర్, హారేరామ్, వైకే రావులు సందర్శించారు. రంగనాయక సాగర్ బండ్, సర్జిపుల్ పంప్, టన్నెల్, పల్లగుట్టపై ఉన్న ఇరిగేషన్ ఏస్ఈ కార్యాలయం, గెస్ట్ హౌస్ లపై వివరాలను ప్రాజెక్టు అధికారులను అడిగి తెలుసుకున్నారు. రంగనాయక సాగర్ రిజర్వాయర్ నిర్మాణం అద్భుతంగా ఉందని ప్రశంసించారు. రిజర్వాయర్ ద్వారా కాలంతో పని లేకుండా రెండు పంటలు సాగు చేసుకోవచ్చునని పేర్కొన్నారు.

వారితో పాటు ఇరిగేషన్ ఏస్ఈ బస్వరాజ్, ఈఈ గోపాలకృష్ణ, ఏఈ ఖాజాతో పాటు ప్రాజెక్టు అధికారులు పాల్గొన్నారు. అనంతరం నాబార్డ్ చైర్మన్, సభ్యులు హెలికాప్టర్ ఏరియల్ వ్యూ ద్వారా మల్లన్న సాగర్ జలాశయం‌ను వీక్షించారు. రంగనాయక సాగర్, మల్లన్న సాగర్ సందర్శన నిమిత్తం రంగనాయక సాగర్‌కు హెలికాప్టర్‌లో చేరుకున్న నాబార్డ్ చైర్మన్, సభ్యులకు జిల్లా అదనపు కలెక్టర్ శ్రీ ముజమిల్ ఖాన్ పుష్పగుచ్చం అందించి ఘన స్వాగతం పలికారు.

Tags:    

Similar News