మిస్టరీ.. లారీలో మంటలు.. వ్యక్తి సజీవ దహనం

దిశ ప్రతినిధి, నిజామాబాద్: నిజామాబాద్ నగర శివారులోని 6వ టౌన్ పోలీస్ స్టేషన్ ఎదుట పార్కింగ్ చేసిన లారీలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో గుర్తు తెలియని వ్యక్తి సజీవ దహనం అయ్యాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. స్థానిక పోలీస్ స్టేషన్ ప్రాంతంలో నివసించే ముజాహిద్‌కు లారీ ఉంది. ఇటీవల ట్రాన్స్‌పోర్ట్ పనులు లేకపోవడంతో లారీని గత కొన్ని రోజులుగా పోలీస్ స్టేషన్ సమీపంలో ఉండే ఖాళీ స్థలంలో పార్కింగ్ చేశాడు. ఏమి జరిగిందో […]

Update: 2021-01-19 13:46 GMT

దిశ ప్రతినిధి, నిజామాబాద్: నిజామాబాద్ నగర శివారులోని 6వ టౌన్ పోలీస్ స్టేషన్ ఎదుట పార్కింగ్ చేసిన లారీలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో గుర్తు తెలియని వ్యక్తి సజీవ దహనం అయ్యాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. స్థానిక పోలీస్ స్టేషన్ ప్రాంతంలో నివసించే ముజాహిద్‌కు లారీ ఉంది. ఇటీవల ట్రాన్స్‌పోర్ట్ పనులు లేకపోవడంతో లారీని గత కొన్ని రోజులుగా పోలీస్ స్టేషన్ సమీపంలో ఉండే ఖాళీ స్థలంలో పార్కింగ్ చేశాడు. ఏమి జరిగిందో తెలియదు కానీ మంగళవారం రాత్రి 11 గంటల ప్రాంతంలో లారీ కేబిన్లో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. దీంతో లారీ దగ్ధం కాగా అందులో ఒక వ్యక్తి కూడా సజీవంగా దహనం అయ్యాడు. రంగంలోకి దిగిన ఫైర్ ఇంజన్ మంటలు ఆర్పీ వేసింది. కానీ అప్పటికే మంటల్లో దహనం అయిన వ్యక్తి గుర్తు పట్టలేనంతగా కాలి పోయాడు.

ఇది ఇలా ఉంటే లారీ యజమాని ముజాహిద్ మాత్రం తాను హైదరాబాద్‌లో ఉన్నానని డ్రైవర్, క్లీనర్‌లు సురక్షితంగా ఉన్నారని చెప్పాడు. లారీ ఎలా దగ్ధం అయిందో అందులో చనిపోయిన వ్యక్తి తనకు తెలియదని చెబుతున్నాడు. అయితే, పోలీస్ స్టేషన్ ఎదుట లారీ నిలిచినా ప్రాంతంను సీజ్ చేసిన వాహనాలు ఉంచుతారని తెలిసింది. అలాంటి ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకోవడం పలు అనుమానాలకు దారి తీస్తోంది. రాత్రి వేళ గుర్తు తెలియని వ్యక్తి మద్యం సేవించి స్టేషన్ ఏరియాలో సంచరిస్తుంటే పోలీస్ సిబ్బంది మందలించినట్టు సమాచారం. దీంతో అక్కడి నుంచే వెళ్లిన వ్యక్తి మంటల్లో మాడి మసి అయినట్టు స్థానికులు అనుమానం వ్యక్తం చేశారు. కానీ, లారీలో మంటలు ఎలా వ్యాపించాయన్నదే మిస్టరీగా మారింది. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు సీసీ టీవీ ఫుటేజీ ఆధారంగా కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Tags:    

Similar News