ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ కన్నుమూత
బాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్, సింగర్ వాజిద్ ఖాన్(42) కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన ముంబై, చెంబూర్‌లోని సురన ఆస్పత్రిలో తుది శ్వాస విడిచారు. కిడ్నీ సమస్యతో బాధపడుతున్న వాజిద్‌కు కొద్ది రోజుల క్రితం కరోనా పాజిటివ్ అని తేలింది. దీంతో ఆరోగ్యం పూర్తిగా క్షీణించి ఆదివారం రాత్రి చనిపోయారు. ఆయన మృతి పట్ల బాలీవుడ్ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. సల్మాన్ ఖాన్ హీరోగా 1998లో వచ్చిన ‘ప్యార్ కియా తో డర్‌నా క్యా’ […]
బాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్, సింగర్ వాజిద్ ఖాన్(42) కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన ముంబై, చెంబూర్‌లోని సురన ఆస్పత్రిలో తుది శ్వాస విడిచారు. కిడ్నీ సమస్యతో బాధపడుతున్న వాజిద్‌కు కొద్ది రోజుల క్రితం కరోనా పాజిటివ్ అని తేలింది. దీంతో ఆరోగ్యం పూర్తిగా క్షీణించి ఆదివారం రాత్రి చనిపోయారు. ఆయన మృతి పట్ల బాలీవుడ్ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు.
సల్మాన్ ఖాన్ హీరోగా 1998లో వచ్చిన ‘ప్యార్ కియా తో డర్‌నా క్యా’ అనే సినిమాతో సాజిద్ -వాజిద్ ద్వయం బాలీవుడ్‌లో మ్యూజిక్ డైరెక్టర్లుగా ఆరంగేట్రం చేశారు. ఈ ద్వయంలో ఒకరే వాజిద్ ఖాన్. గర్వ్, తేరేనామ్, తుమ్‌కో నా బూల్ పాయేంగే, పార్టనర్, దబాంగ్ సినిమాలకు ఈ జోడీ అద్భుతమైన సంగీతం సమకూర్చి ఆయా సినిమాల విజయాల్లో ప్రముఖ పాత్ర పోషించారు. ఐపీఎల్ 4కు థీమ్ సాంగ్‌తో పాటు ‘దూమ్ ధూమ్ ధూమ్ దడక్’కు కూడా సాజిద్- వాజిద్ ఖాన్ ద్వయం మ్యూజిక్ అందించారు. లాక్‌డౌన్‌లోనూ హీరో సల్మాన్ ఖాన్ ‘భాయ్ భాయ్’ పాటకు సంగీతం అందించారు.
‘టెర్రిబుల్ న్యూస్. వాజిద్ ఖాన్ నవ్వును మేమెప్పుడూ మర్చిపోలేం. చాలా చిన్న వయసులోనే మమ్మల్ని వదిలివెళ్లిపోయారు. వారి కుటుంబానికి సంతాపం తెలియజేస్తున్నాం. మా ఆలోచనల్లో వాజిద్ భాయ్ ఎప్పటికీ అలానే నిలిచిపోతారు’ అని ప్రియాంక చోప్రా దంపతులు ట్వీట్ చేశారు. అలానే వాజిద్ ఆకస్మిక మృతి పట్ల ప్రముఖ నేపథ్య గాయకుడు సోనునిగం సంతాపం తెలిపారు.
‘వాజిద్ మృతి పట్ల నేను షాక్‌కు గురయ్యాను. అతను నాకు, మా కుటుంబానికి ఎంతో కావాల్సిన వారు. చాలా పాజిటివ్‌గా ఆలోచించే వ్యక్తుల్లో వాజిద్ ఒకరు. వారి కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి’ – వరుణ్ ధావన్
‘వాజిద్ చనిపోయాడన్న వార్త విని షాకయ్యాను. ఐ యాయ్ బ్రోకెన్. వాళ్ల కుటుంబానికి అల్లాహ్ ధైర్యాన్ని ఇవ్వాలి. వాజిద్ మరణం తీరని లోటు’- కంపోజర్, సింగర్ సలీమ్ మర్చంట్