మజిల్ గర్ల్స్.. యూనిక్ ఫిట్‌నెస్ థీమ్ బార్

దిశ, ఫీచర్స్: బ్లాక్ క్యాట్ కేఫ్ నుంచి ఉమెన్స్ థైస్(తొడలు)కు అంకితమైన రెస్టారెంట్‌ల వరకు భిన్నరకాల థీమ్ ఓరియెంటెడ్ బార్‌, కేఫ్‌లకు జపాన్ ప్రసిద్ది. ఈ క్రమంలోనే ఫిట్‌నెస్ థీమ్డ్ బార్‌గా పేరుగాంచిన ‘మజిల్ గర్ల్స్’ ఫిమేల్ వెయిట్ ట్రైనర్స్‌ స్టాఫ్‌‌‌ను మెయింటెయిన్ చేస్తూ విభిన్నతను చాటుకుంటోంది. దేశంలోనే ఈ తరహా తొలి బార్ ఇదే కావడం విశేషం. ఎరి మజిల్ అనే యంగ్ ఫిట్‌నెస్ ట్రైనర్ ‘మజిల్ గర్ల్స్’‌ను తొలిగా ఉమెన్స్ జిమ్‌గా ప్రారంభించింది. ఈ […]

Update: 2021-06-19 05:48 GMT

దిశ, ఫీచర్స్: బ్లాక్ క్యాట్ కేఫ్ నుంచి ఉమెన్స్ థైస్(తొడలు)కు అంకితమైన రెస్టారెంట్‌ల వరకు భిన్నరకాల థీమ్ ఓరియెంటెడ్ బార్‌, కేఫ్‌లకు జపాన్ ప్రసిద్ది. ఈ క్రమంలోనే ఫిట్‌నెస్ థీమ్డ్ బార్‌గా పేరుగాంచిన ‘మజిల్ గర్ల్స్’ ఫిమేల్ వెయిట్ ట్రైనర్స్‌ స్టాఫ్‌‌‌ను మెయింటెయిన్ చేస్తూ విభిన్నతను చాటుకుంటోంది. దేశంలోనే ఈ తరహా తొలి బార్ ఇదే కావడం విశేషం.

ఎరి మజిల్ అనే యంగ్ ఫిట్‌నెస్ ట్రైనర్ ‘మజిల్ గర్ల్స్’‌ను తొలిగా ఉమెన్స్ జిమ్‌గా ప్రారంభించింది. ఈ జిమ్, బార్‌గా మారడం వెనక ఎరి అలుపెరగని కృషి దాగుంది. 19 సంవత్సరాల వయసులో బరువు తగ్గేందుకు జిమ్‌కు వెళ్లడం ప్రారంభించిన ఎరి, అందుకోసం ఏరోబిక్స్‌పై ప్రత్యేకంగా దృష్టి పెట్టింది. కానీ చాలా తక్కువ సమయంలోనే అలా చేయడానికి బోర్ కొట్టడంతో, వెయిట్ ట్రైనింగ్ తీసుకోవడం ప్రారంభించింది. ఇది ఆమెలో మరింత ఉత్సాహాన్ని నింపడంతో, వెయిట్ లిఫ్టింగ్ పట్ల అభిరుచి పెంచుకుంది. ఇదే ఆమె జీవితంలో గొప్ప మార్పునకు శ్రీకారంగా మారింది. వెయిట్ ట్రైనింగ్‌లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన ఎరి, తన సొంతంగా ‘మజిల్ గర్ల్స్’ను ఏర్పాటు చేసింది. అయితే ఇటీవలే దాన్ని యూనిక్ బార్‌గా మార్చడంతో పాటు, అదే పేరుతో ఓ యూట్యూబ్ చానల్ కూడా మొదలుపెట్టింది. మజిల్ ఫిట్‌నెస్ గర్ల్స్‌తో నిండిన ఈ బార్ ఫొటోలు, వీడియోలు ఇటీవల కాలంలో వైరల్‌గా మారాయి.

మజిల్ గర్ల్స్ .. ఓ ప్రత్యేకమైన, రంగురంగుల వేదిక. ఇది ఆల్కహాలిక్, ఆల్కహాల్ రహిత పానీయాల మేలు కలయిక. జిమ్ పరికరాలు, ఆకర్షించే ఇంటరీయర్‌తో పాటు ఉరకలెత్తించే సంగీత స్వరాలు నిత్యం మోగుతుంటాయి. అయితే బార్‌కు ప్రధాన ఆకర్షణ మాత్రం అక్కడి స్టాఫ్. ఇందులో యువ మహిళా ఫిట్‌నెస్ ఔత్సాహికులు మాత్రమే ఉంటారు. వారి దేహధారుడ్యంతో బార్‌కు మరింత ఆకర్షణ తీసుకువస్తున్నారు. ఎరి, యోటా, జురికోలతో పాటు ఇతర మజిల్ గర్ల్స్ కేవలం డ్రింక్స్ సర్వ్ చేయడమే కాకుండా, కస్టమర్లను అలరించేందుకు ప్రదర్శనలిస్తారు. జిమ్నాస్టిక్‌ను తలపించే ఫీట్లు, డ్యాన్సులు చేస్తుంటారు. వీరితో ఫొటోలు దిగేందుకు కస్టమర్లు ప్రత్యేక ఫీజు చెల్లించాలి. ఇంతగా అట్రాక్ట్ చేసే ‘మజిల్ గర్ల్స్’ బార్‌కు వెళ్లాలంటే ముందుగానే రిజర్వేషన్ చేసుకోవడం తప్పనిసరి. ప్రస్తుతం పాండెమిక్ పరిస్థితులు ఉండటంతో కేవలం సోషల్ మీడియా ద్వారానే తమ ఫ్యాన్స్, కస్టమర్లను ఇంటారాక్ట్ అవుతున్నారు.

రెస్టారెంట్, బార్ బిజినెస్‌లో మజిలర్ స్టాఫ్‌ బాగా ప్రాచుర్యం పొందారు. గత ఏడాది థాయ్ రెస్టారెంట్ ‘మస్య్కులర్ మెన్స్’ను డెలివరీ బాయ్స్‌గా ఉద్యోగంలోకి తీసుకోగా, బ్యాంకాక్‌కు చెందిన
స్టానీమీహోయ్ రెస్టారెంట్ బఫ్ వెయిటర్స్‌కు ప్రసిద్ధి చెందింది.

Tags:    

Similar News