నల్లగొండలో ఘోర రోడ్డు ప్రమాదం.. మున్సిపల్ ఉద్యోగి మృతి
దిశ, నల్లగొండ : జిల్లా కేంద్రంలో విధుల్లో ఉన్న ఓ మున్సిపల్ ట్రాక్టర్ డ్రైవర్‌ను లారీ ఢీకొనడంతో అక్కడికక్కడే దుర్మరణం చెందాడు. వివరాల ప్రకారం.. మంగళవారం తెల్లవారుజామున మున్సిపాలిటీ డ్రైవర్ మధు.. దేవరకొండ రోడ్డులో ఉన్న ప్రసన్న పెట్రోల్ బంక్ ఎదుట చెత్తను శుభ్రపరిచే పనిలో భాగంగా రోడ్డు పక్కన ట్రాక్టర్‌ను ఆపాడు. అదే సమయంలో దేవరకొండ నుంచి నల్లగొండ పట్టణంలోకి వస్తున్న ఏపీ 07 టీహెచ్ 2357 నెంబరు గల లారీ వెనుక నుంచి ఆగిఉన్న […]
దిశ, నల్లగొండ : జిల్లా కేంద్రంలో విధుల్లో ఉన్న ఓ మున్సిపల్ ట్రాక్టర్ డ్రైవర్‌ను లారీ ఢీకొనడంతో అక్కడికక్కడే దుర్మరణం చెందాడు. వివరాల ప్రకారం.. మంగళవారం తెల్లవారుజామున మున్సిపాలిటీ డ్రైవర్ మధు.. దేవరకొండ రోడ్డులో ఉన్న ప్రసన్న పెట్రోల్ బంక్ ఎదుట చెత్తను శుభ్రపరిచే పనిలో భాగంగా రోడ్డు పక్కన ట్రాక్టర్‌ను ఆపాడు. అదే సమయంలో దేవరకొండ నుంచి నల్లగొండ పట్టణంలోకి వస్తున్న ఏపీ 07 టీహెచ్ 2357 నెంబరు గల లారీ వెనుక నుంచి ఆగిఉన్న మున్సిపాలిటీ ట్రాక్టర్‌ను ఢీకొట్టింది.
ఈ ప్రమాదంలో ట్రాక్టర్ సీట్లో కూర్చున్న డ్రైవర్ మధు (22) ఎగిరి రోడ్డుపై పడటంతో తీవ్రమైన గాయాలై, అక్కడికక్కడే మృతి చెందాడు. అప్పటి వరకూ తమ కళ్లముందే ఉన్న మధు చనిపోవడంతో, శానిటేషన్ సిబ్బంది, కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. పోలీసులు వచ్చి రోడ్డుకు అడ్డంగా ఉన్న లారీ, ట్రాక్టర్లను జేసీబీ సహాయంతో తొలగించారు. ప్రమాద ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు.
మధు కుటుంబాన్ని ఆదుకోవాలని ధర్నా..
విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన మున్సిపల్ కాంట్రాక్ట్ ఉద్యోగి, ట్రాక్టర్ డ్రైవర్ కుటుంబాన్ని ఆదుకోవాలని ట్రాక్టర్ డ్రైవర్లు, శానిటేషన్ సిబ్బంది, కమ్యూనిస్టు నాయకులు పెద్ద ఎత్తున ధర్నా చేశారు. బాధిత కుటుంబానికి డబుల్ బెడ్ రూం ఇళ్లు, కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం కల్పించాలని ఆందోళనలో భాగంగా వారు డిమాండ్ చేశారు. ఈ నిరసన కార్యక్రమంలో మున్సిపల్ ట్రాక్టర్ డ్రైవర్లు, కౌన్సిలర్ ఖయ్యుం బేగ్, సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షులు ఎండీ సలీం, జిల్లా సహాయ కార్యదర్శి దండెంపల్లి సత్తయ్య, తదితరులు ఉన్నారు.