ముంబై ఓపెనర్లు ఢమాల్
దిశ, వెబ్‌డెస్క్: ఐపీఎల్ 11వ మ్యాచ్‌లో సెకండ్ ఇన్నింగ్స్ ఆడుతున్న ముంబై ఇండియన్స్ ఆదిలోనే ఇబ్బందుల్లో పడింది. ఓపెనర్ రోహిత్ శర్మ (8) పట్టుమని పది పరుగులు చేయకుండానే పెవిలియన్ చేరాడు. 14 స్కోర్ వద్ద వాషింగ్టన్ సుందర్ వేసిన బంతిని షాట్ ఆడబోయి నేగికి క్యాచ్ ఇచ్చాడు. ఆ తర్వాత వన్‌డౌన్ వచ్చిన సూర్యకుమార్ (0) యాదవ్ సైతం ఇసురు ఉదాన బౌలింగ్‌లో కీపర్‌కు క్యాచ్ ఇచ్చి డకౌట్ అయ్యాడు. మొదటి నుంచి బాల్ టు […]
దిశ, వెబ్‌డెస్క్: ఐపీఎల్ 11వ మ్యాచ్‌లో సెకండ్ ఇన్నింగ్స్ ఆడుతున్న ముంబై ఇండియన్స్ ఆదిలోనే ఇబ్బందుల్లో పడింది. ఓపెనర్ రోహిత్ శర్మ (8) పట్టుమని పది పరుగులు చేయకుండానే పెవిలియన్ చేరాడు. 14 స్కోర్ వద్ద వాషింగ్టన్ సుందర్ వేసిన బంతిని షాట్ ఆడబోయి నేగికి క్యాచ్ ఇచ్చాడు. ఆ తర్వాత వన్‌డౌన్ వచ్చిన సూర్యకుమార్ (0) యాదవ్ సైతం ఇసురు ఉదాన బౌలింగ్‌లో కీపర్‌కు క్యాచ్ ఇచ్చి డకౌట్ అయ్యాడు.
మొదటి నుంచి బాల్ టు బాల్ ఆడుతున్న క్వింటెన్ డీకాక్(14) కూడా స్పిన్నర్ చాహల్ వేసిన ఓవర్‌లో షాట్ ఆడబోయి నేగికి క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. దీంతో 39 పరుగుల వద్ద ముంబై ఇండియన్స్ మూడు కీలక వికెట్లను కోల్పోయింది. ప్రస్తుతం క్రీజులో మిడిలార్డర్లు ఇషాన్ కిషన్, హార్దిక్ పాండ్యా ఉన్నారు. 9 ఓవర్లు ముగిసే సరికి ముంబై ఇండియన్స్ స్కోరు 58/3గా ఉంది. ఇంకా 66 బంతుల్లో 144 స్కోర్ చేయాల్సి ఉంది.