పీఎంకు థ్యాంక్స్ చెప్పిన ‘మహా’ సీఎం
ముంబయి : మహారాష్ట్రకు చెందిన ప్రముఖ బయో మెడికల్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ హాఫ్‌కిన్‌లో ‘కొవాగ్జిన్’ వ్యాక్సిన్ ఉత్పత్తికి కేంద్ర ప్రభుత్వం అనుమతినిచ్చింది. కరోనా ఉధృతి నేపథ్యంలో హాఫ్‌కిన్‌కు కొవాగ్జిన్ ఉత్పత్తికి అనుమతులివ్వాలని రెండ్రోజుల క్రితం రాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాక్రే.. ప్రధాని నరేంద్ర మోడీని కోరారు. ఈ మేరకు గురువారం కేంద్ర సైన్స్ అండ్ టెక్నాలజీ డిపార్ట్‌మెంట్ సెక్రెటరీ రేణు స్వరూప్.. హాఫ్‌కిన్ లో కొవాగ్జిన్ ఉత్పత్తికి అనుమతి మంజూరు చేస్తూ మహారాష్ట్ర చీఫ్ సెక్రెటరీకి లేఖ […]
ముంబయి : మహారాష్ట్రకు చెందిన ప్రముఖ బయో మెడికల్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ హాఫ్‌కిన్‌లో ‘కొవాగ్జిన్’ వ్యాక్సిన్ ఉత్పత్తికి కేంద్ర ప్రభుత్వం అనుమతినిచ్చింది. కరోనా ఉధృతి నేపథ్యంలో హాఫ్‌కిన్‌కు కొవాగ్జిన్ ఉత్పత్తికి అనుమతులివ్వాలని రెండ్రోజుల క్రితం రాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాక్రే.. ప్రధాని నరేంద్ర మోడీని కోరారు. ఈ మేరకు గురువారం కేంద్ర సైన్స్ అండ్ టెక్నాలజీ డిపార్ట్‌మెంట్ సెక్రెటరీ రేణు స్వరూప్.. హాఫ్‌కిన్ లో కొవాగ్జిన్ ఉత్పత్తికి అనుమతి మంజూరు చేస్తూ మహారాష్ట్ర చీఫ్ సెక్రెటరీకి లేఖ రాశారు.
కేంద్రం అనుమతితో హాఫ్‌కిన్‌లో ఏడాది పాటు కొవాగ్జిన్ వ్యాక్సిన్ లను ఉత్పత్తి చేయనున్నారు. భారత్ బయోటెక్ రూపొందించిన ఈ వ్యాక్సిన్.. ఇందుకు సంబంధించిన టెక్నాలజీని హాఫ్‌కిన్‌కు బదలాయింపు చేస్తుంది. కాగా.. వందేండ్లకు పైగా చరిత్ర ఉన్న హాఫ్‌కిన్‌ను 1899లో ఏర్పాటు చేశారు. ప్లేగు వ్యాధికి వ్యాక్సిన్ కనుగొన్న డాక్టర్ వాల్డెమర్ హాఫ్‌కిన్ పేరును ఈ ఇనిస్టిట్యూట్‌కు పెట్టారు. కేంద్రం తాజా నిర్ణయంతో మోడీకి ఉద్ధవ్ థాక్రే కృతజ్ఞతలు తెలిపారు. మహారాష్ట్రలో కరోనా రెండో దశ స్వైర విహారం చేస్తున్న విషయం విదితమే. గురువారం రాష్ట్రంలో 61,695 కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో 5 లక్షలకు పైగా యాక్టివ్ కేసులున్నాయి.