ములుగుకు గుడ్ బై? ఆ నియోజకవర్గం నుంచి పోటీ?

దిశ, మణుగూరు : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక నియోజకవర్గం మణుగూరు మండలంలోని మున్సిపాలిటీ పరిధిలో ఉన్న అన్నారం గ్రామంలో జరిగిన దేవి నవరాత్రి ఉత్సవాలలో ములుగు ఎమ్మెల్యే సీతక్క పాల్గొన్నారు. శనివారం మండలంలోని అన్నారం గ్రామంలో దేవి నవరాత్రి ఉత్సవాలు సీనియర్ జర్నలిస్ట్ రాధ ఆధ్వర్యంలో నిర్వహించారు. అనంతరం జర్నలిస్ట్ రాధా ఆధ్వర్యంలో ఓ నూతన దిన పత్రికను ఆవిష్కరించారు. ఈసందర్బంగా సీతక్కా మాట్లడుతూ.. రైతులు భూములు కోల్పోతున్నారని, భూసేకరణ చట్ట ప్రకారం రైతులకు నష్ట […]

Update: 2021-10-16 22:56 GMT

దిశ, మణుగూరు : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక నియోజకవర్గం మణుగూరు మండలంలోని మున్సిపాలిటీ పరిధిలో ఉన్న అన్నారం గ్రామంలో జరిగిన దేవి నవరాత్రి ఉత్సవాలలో ములుగు ఎమ్మెల్యే సీతక్క పాల్గొన్నారు. శనివారం మండలంలోని అన్నారం గ్రామంలో దేవి నవరాత్రి ఉత్సవాలు సీనియర్ జర్నలిస్ట్ రాధ ఆధ్వర్యంలో నిర్వహించారు. అనంతరం జర్నలిస్ట్ రాధా ఆధ్వర్యంలో ఓ నూతన దిన పత్రికను ఆవిష్కరించారు. ఈసందర్బంగా సీతక్కా మాట్లడుతూ.. రైతులు భూములు కోల్పోతున్నారని, భూసేకరణ చట్ట ప్రకారం రైతులకు నష్ట పరిహారం చెల్లించకుండా ప్రభుత్వం ఇష్టానుసారంగా వ్యవహరిస్తూ రైతుల జీవితాలను నాశనం చేస్తుందని ప్రభుత్వంపై ఆమె మండిపడ్డారు. భూములు కోల్పోయిన రైతులకు గుంటకు పదివేలు చొప్పున ప్రభుత్వం ఇస్తుందని వ్యాఖ్యానించారు. ఇప్పుడు ఉన్న మార్కెట్లో భూముల ధర సెంటు నాలుగు లక్షల రూపాయలనుంచి పది లక్షల వరకు ఉంటుందని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం రైతులకు చెల్లించిన నష్ట పరిహార డబ్బులు భూమి కొనుగోలు కూడా సరిపోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.

భూములు కోల్పోయిన రైతులకు నష్ట పరిహారంతో పాటు ఉద్యోగం కల్పించాలన్నారు. ఈప్రాంతంలో ఉన్న పోడు భూముల కోసం అసెంబ్లీలో పోరాడుతాని, పోడు భూములకు పట్టా పాస్ పుస్తకాలు సాధించేవరకు పోరాటాలు చేస్తానన్నారు. తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత భూస్వాములే పగ్గాలు చేపట్టారని పేద ప్రజలకు ఒరిగిందేమీ లేదని ఆమె మండిపడ్డారు.

సీతక్కరాకతో భారీగా తరలివచ్చిన జనం….

మండలంలో ములుగు ఎమ్మెల్యే సీతక్క వచ్చిందని తెలుసుకొని చుట్టుపక్కల ప్రజలు భారీగా తరలివచ్చారు. పినపాక నియోజకవర్గంలో వచ్చే ఎన్నికల్లో సీతక్క పోటీ చేస్తే బాగుంటుందని ప్రజలు మాట్లాడుకున్నారు. కానీ, సీతక్కరాజకీయం గురించి ఏమి మాట్లాడకపోవడం గమనార్హం. మరీ సీతక్క పోటీ విషయం నియోజకవర్గంలో ప్రశ్నగా మారింది. మరి వచ్చే ఎన్నికల్లో నియోజకవర్గంలో పోటీ చేస్తారా..లేదా..అనేది వేచిచూడాల్సిందే.. ఈకార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు గాదె కేశవరెడ్డి, పొలమర్రి రాజు, బట్టా విజయ గాంధీ, అచ్చ నవీన్, అరిఫ్ పాషా, బుడుగుల నర్సయ్య, ఓరుగంటి భిక్షమయ్య, చంచల రాము, బెత్తం రామకృష్ణ, మహేష్, భజన సతీష్, బట్టా సత్యనారాయణ, చందా వరప్రసాద్ తదితరులు నాయకులు పాల్గొన్నారు.

Tags:    

Similar News