బిగ్‌ బ్రేకింగ్ : తీవ్ర అస్వస్థతకు గురైన ములుగు ఎమ్మెల్యే సీతక్క

దిశ, వాజేడు : ములుగు జిల్లా ఏటూరునాగారం మండల కేంద్రంలో నిర్వహించిన దళిత గిరిజన ఆత్మగౌరవ దండోర యాత్రలో పాల్గొన్న సీతక్క అస్వస్థతకు గురయ్యారు. నాలుగు కిలోమీటర్లు పాదయాత్ర చేసిన అనంతరం తహసీల్దార్ కార్యాలయం వరకు చేరుకున్న ఆమె ఎమ్మార్వోకు మెమోరాండం ఇచ్చాక అస్వస్థకు గురయ్యారు. గమనించిన కార్యకర్తలు ఆమెను హుటాహుటిన స్థానిక సామాజిక వైద్యశాలకు తరలించగా వైద్యులు చికిత్స అందిస్తున్నారు. ఆ సమయంలో ఆసుపత్రి సూపరింటెండెంట్ అందుబాటులో లేకపోవడంతో ప్రజాప్రతినిధులతో పాటు సీతక్క అభిమానులు, కార్యకర్తలు […]

Update: 2021-09-21 03:50 GMT

దిశ, వాజేడు : ములుగు జిల్లా ఏటూరునాగారం మండల కేంద్రంలో నిర్వహించిన దళిత గిరిజన ఆత్మగౌరవ దండోర యాత్రలో పాల్గొన్న సీతక్క అస్వస్థతకు గురయ్యారు. నాలుగు కిలోమీటర్లు పాదయాత్ర చేసిన అనంతరం తహసీల్దార్ కార్యాలయం వరకు చేరుకున్న ఆమె ఎమ్మార్వోకు మెమోరాండం ఇచ్చాక అస్వస్థకు గురయ్యారు.

గమనించిన కార్యకర్తలు ఆమెను హుటాహుటిన స్థానిక సామాజిక వైద్యశాలకు తరలించగా వైద్యులు చికిత్స అందిస్తున్నారు. ఆ సమయంలో ఆసుపత్రి సూపరింటెండెంట్ అందుబాటులో లేకపోవడంతో ప్రజాప్రతినిధులతో పాటు సీతక్క అభిమానులు, కార్యకర్తలు డాక్టర్ తీరుపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ఆయన్ను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు.

Tags:    

Similar News