ఫోర్బ్స్ జాబితాలో అగ్రస్థానానికి ముఖేశ్!
దిశ, వెబ్‌డెస్క్: రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేశ్ అంబానీ రూ. 2.7 లక్షల కోట్ల సంపదతో ఫోర్బ్స్ భారత బిలినియర్ల జాబితాలో అగ్రస్థానాన్ని కాపాడుకున్నారు. గతేడాది నుంచి రూ. 99 వేల కోట్ల వరకూ సంపద తగ్గినప్పటికీ టాప్ వన్ స్థానాన్ని నిలుపుకున్నారు. ఇక, ఆయన తర్వాత రిటైల్ దిగ్గజం డీ మార్ట్ అధినేత రాధాకృష్ణ దమానీ రూ. 1.3 లక్షల కోట్ల సంపదతో రెండో అత్యంత సంపన్నుడిగా ఉన్నారు. దమానీ సంపద 25 శాతం పెరిగింది. […]
దిశ, వెబ్‌డెస్క్: రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేశ్ అంబానీ రూ. 2.7 లక్షల కోట్ల సంపదతో ఫోర్బ్స్ భారత బిలినియర్ల జాబితాలో అగ్రస్థానాన్ని కాపాడుకున్నారు. గతేడాది నుంచి రూ. 99 వేల కోట్ల వరకూ సంపద తగ్గినప్పటికీ టాప్ వన్ స్థానాన్ని నిలుపుకున్నారు. ఇక, ఆయన తర్వాత రిటైల్ దిగ్గజం డీ మార్ట్ అధినేత రాధాకృష్ణ దమానీ రూ. 1.3 లక్షల కోట్ల సంపదతో రెండో అత్యంత సంపన్నుడిగా ఉన్నారు. దమానీ సంపద 25 శాతం పెరిగింది. కొవిడ్-19 వ్యాప్తి దేశవ్యాప్తంగా పెరుగుతున్నప్పటికీ దమానీ సంపద పెరగడం విశేషం. ఈ ఏడాదిలో ఉత్పత్తి తగ్గిపోవడం, కొవిడ్-19 వల్ల లాక్‌డౌన్ విధించడం వంటి పరిణమాలాతో ఇండియాలోని సంపన్నులకు రాబడి చాలా తగ్గిందని ఫోర్బ్స్ తెలిపింది. 2019 ఏడాదిలో ఇండియా బిలియనీర్ల సంఖ్య 106 ఉండగా, ఈ ఏడాదిలో 102కు తగ్గిందని, బిలియనీర్ల సంపద ఒక్కసారిగా 23 శాతం దిగజారినట్టు ఫోర్బ్స్ వెల్లడించింది.
ఫోర్బ్స్ వెల్లడించిన జాబితాలో హెచ్‌సీఎల్ వ్యవస్థాపకుడు శివ్‌నాడార్ రూ. 89,250 కోట్లతో మూడో స్థానంలో ఉండగా, కోటక్ మహీంద్రా బ్యాంక్ సీఈవో ఉదయ్ కోటక్ రూ. 78,000 తో నాలుగో స్థానంలో ఉన్నారు. గౌతమ్ అదానీ రూ. 66,700 కోట్లతో ఐదో స్థానంలో, టెలికాం దిగ్గజం ఎయిర్‌టెల్ వ్యవస్థాపకుడు రూ. 67,000 కోట్లతో 6వ స్థానంలో ఉన్నారు. టాప్ 10 జాబితాలో సైరస్ పూనావాలా, కుమార్ బిర్లా, లక్ష్మీ మిట్టల్, అజీమ్ ప్రేమ్‌జీ, దిలీప్ సంఘ్వీలు చోటు దక్కించుకున్నారు.
Tags: Forbes Billionaires List 2020, Mukesh Ambani, Radhakishan Damani, top 10 forbs list