చంద్రబాబుకు ముద్రగడ లేఖ.. అప్పుడు గుర్తు రాలేదా అంటూ కౌంటర్
దిశ, ఏపీ బ్యూరో : టీడీపీ అధినేత చంద్రబాబుకి కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం ఘాటుగా లేఖ రాశారు. తన కుటుంబాన్ని అవమానించారంటూ చంద్రబాబు ఏడవడం తనకు ఆశ్చర్యం కలిగించిందని లేఖలో పేర్కొన్నారు. గతంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తన కుటుంబాన్ని బూతులతో తిట్టించినప్పుడు, 14 రోజులపాటు జైల్లో పెట్టించినప్పుడు ఇవన్నీ గుర్తు రాలేదా అంటూ ప్రశ్నించారు. తనను తీహార్ జైలుకు తరలించారని, అణిచివేతతో ఆత్మహత్య చేసుకునేలా చేశారని లేఖలో పేర్కొన్న ముద్రగడ.. శపథాలు చేయొద్దని చంద్రబాబుకి […]
దిశ, ఏపీ బ్యూరో : టీడీపీ అధినేత చంద్రబాబుకి కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం ఘాటుగా లేఖ రాశారు. తన కుటుంబాన్ని అవమానించారంటూ చంద్రబాబు ఏడవడం తనకు ఆశ్చర్యం కలిగించిందని లేఖలో పేర్కొన్నారు. గతంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తన కుటుంబాన్ని బూతులతో తిట్టించినప్పుడు, 14 రోజులపాటు జైల్లో పెట్టించినప్పుడు ఇవన్నీ గుర్తు రాలేదా అంటూ ప్రశ్నించారు.
తనను తీహార్ జైలుకు తరలించారని, అణిచివేతతో ఆత్మహత్య చేసుకునేలా చేశారని లేఖలో పేర్కొన్న ముద్రగడ.. శపథాలు చేయొద్దని చంద్రబాబుకి తెలిపారు. జీవితాలు, ఆస్తులు, పదవులు, ఎవ్వరికీ శాశ్వతం కాదనీ.. ప్రజలు బూటు కాలితో తన్నించుకోవడం కోసమో, కేసులు పెట్టించుకోవడం కోసమో ఓట్లు వేయరని చంద్రబాబు గ్రహించాలని లేఖలో పేర్కొన్నారు.