జులై నుంచి ఎంఎస్ఎంఈల కొత్త మార్గదర్శకాల అమలు!
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా ఉన్న 6 కోట్లకు పైగా ఎంఎస్ఎంఈ కంపెనీలు కొత్త మార్గదర్శకాలకు అనుగుణంగా జులై నుంచి వర్గీకరించబడనున్నాయి. సవరించిన ప్రమాణాల ప్రకారం రూ. 50 కోట్ల పెట్టుబడితో రూ.250 కోట్ల టర్నోవర్ కలిగిన సంస్థలు మధ్య తరహా వ్యాపారంలోకి, రూ. 1 కోటి పెట్టుబడితో రూ. 5 కోట్ల టర్నోవర్ ఉన్న వ్యాపారాలు సూక్ష్మ తరహా విభాగంలోకి, రూ. 10 కోట్ల పెట్టుబడితో రూ. 50 కోట్ల టర్నోవర్ ఉన్న సంస్థలు చిన్న తరహా సంస్థలుగా […]
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా ఉన్న 6 కోట్లకు పైగా ఎంఎస్ఎంఈ కంపెనీలు కొత్త మార్గదర్శకాలకు అనుగుణంగా జులై నుంచి వర్గీకరించబడనున్నాయి. సవరించిన ప్రమాణాల ప్రకారం రూ. 50 కోట్ల పెట్టుబడితో రూ.250 కోట్ల టర్నోవర్ కలిగిన సంస్థలు మధ్య తరహా వ్యాపారంలోకి, రూ. 1 కోటి పెట్టుబడితో రూ. 5 కోట్ల టర్నోవర్ ఉన్న వ్యాపారాలు సూక్ష్మ తరహా విభాగంలోకి, రూ. 10 కోట్ల పెట్టుబడితో రూ. 50 కోట్ల టర్నోవర్ ఉన్న సంస్థలు చిన్న తరహా సంస్థలుగా పరిగణించబడతాయి. ఎంఎస్ఎంఈలు మరింత విస్తరించడానికి కొత్త మార్గదర్శకాలు ఉపయోగపడతాయని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ పేర్కొంది. నిజానికి, టర్నోవర్ లెక్కింపుల నుంచి ఎంఎస్ఎంఈ ఎగుమతులను మినహాయింపు ఇవ్వాల్సి ఉంది. దీనివల్ల వీటి నెట్‌వర్క్ ప్రయోజనాలు కోల్పోకుండా మరిన్ని ఎగుమతులు చేసే వీలుని కలుగుతుంది. అయితే, కొత్త మార్గదర్శకాలతో ఎగుమతుల రంగం గణనీయంగా పెరుగుదలను నమోదు చేస్తుందని అంచనా. దీంతో ఆర్థికంగా బలడటమే కాకుండా ఉద్యోగ అవకాశాలు వస్తాయి. ఎంఎస్ఎంఈ కొత్త మార్గదర్శకాల సవరణలకు ప్రధాని మోదీ నేతృత్వంలోని ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ ఆమోదం తెలిపింది. భారత జీడీపీలో ఎంఎస్ఎంఈల వాటా 29 శాతం వరకు ఉంటుంది. ఎగుమతుల్లో సగం వరకు ఇవే భర్తీ చేస్తాయి. 11 కోట్లకు పైగా కార్మికులు ఈ కంపెనీల్లో పని చేస్తున్నారు.