‘ధోని రిటైర్మెంట్‌ మాకు ముందే తెలుసు’

దిశ, స్పోర్ట్స్ : టీం ఇండియా మాజీ కెప్టెన్ (Former Team India captain), మిస్టర్ కూల్ ఎంఎస్ ధోని (MS Dhoni) శనివారం అనూహ్యంగా తన అంతర్జాతీయ క్రికెట్‌ (International Cricket‌)కు గుడ్‌బై చెప్పిన విషయం తెలిసిందే. ఈ ప్రకటనపై క్రికెట్ అభిమానులే కాక ఎంతో మంది క్రికెటర్లు (Cricketers)కూడా ఆశ్చర్యానికి గురయ్యారు. మరికొన్ని రోజులు అంతర్జాతీయ క్రికెట్ (International Cricket‌)ఆడతారని భావించినా.. అకస్మాత్తుగా అతను వీడ్కోలు పలకడం ఎవరూ జీర్ణించుకోలేక పోతున్నారు. అయితే ఇది […]

Update: 2020-08-16 07:13 GMT

దిశ, స్పోర్ట్స్ : టీం ఇండియా మాజీ కెప్టెన్ (Former Team India captain), మిస్టర్ కూల్ ఎంఎస్ ధోని (MS Dhoni) శనివారం అనూహ్యంగా తన అంతర్జాతీయ క్రికెట్‌ (International Cricket‌)కు గుడ్‌బై చెప్పిన విషయం తెలిసిందే. ఈ ప్రకటనపై క్రికెట్ అభిమానులే కాక ఎంతో మంది క్రికెటర్లు (Cricketers)కూడా ఆశ్చర్యానికి గురయ్యారు. మరికొన్ని రోజులు అంతర్జాతీయ క్రికెట్ (International Cricket‌)ఆడతారని భావించినా.. అకస్మాత్తుగా అతను వీడ్కోలు పలకడం ఎవరూ జీర్ణించుకోలేక పోతున్నారు.

అయితే ఇది అకస్మాత్తు నిర్ణయం కాదని.. ధోని మనసులో ఎన్నాళ్ల నుంచో ఉందని ఝార్ఖండ్ క్రికెటర్ విరాట్ సింగ్ (Jharkhand cricketer Virat Singh) అంటున్నాడు. తాజాగా ధోనీ రిటైర్మెంట్‌ (Retirement)పై స్పందించిన విరాట్ సింగ్ మాట్లాడుతూ.. ‘గత ఏడాది ఐసీసీ వరల్డ్ కప్‌ (ICC World Cup)లో కివీస్‌పై జరిగిన సెమీ ఫైనల్ మ్యాచ్ ధోనికి చివరి అంతర్జాతీయ మ్యాచ్ అని తెలుసు. అప్పట్లో రాంచీలో నెట్ ప్రాక్టీస్ (Net Practice) చేస్తున్న ధోనీ.. రిటైర్మెంట్ అవ్వాలని భావిస్తున్నట్లు మాకు తెలిసింది.

వరల్డ్ కప్ (World Cup) తర్వాత అతను ఈ విషయం జార్ఖండ్ ఆటగాళ్ల (Jharkhand players)కు కూడా తెలుసు. కానీ సెమీస్ ఓడిపోవడం పెద్ద దురదృష్టం. అతడు రనౌట్ (Run out)అయ్యి వస్తుంటే నేను చాలా భావోద్వేగానికి గురయ్యా. అతడు ఆ రోజే రిటైర్ అయ్యాడని నాకు తెలుసు. శనివారం అతను చేసిన ప్రకటన కేవలం అధికారికమే’ అని విరాట్ సింగ్ అన్నాడు. ప్రపంచంలో అత్యుత్తమ కెప్టెన్ ధోనీయే అని.. వందేళ్ల తర్వాత రికార్డులు చూసినా ధోనీ రికార్డు చెక్కుచెదరదని అతడు అన్నాడు.

Tags:    

Similar News