'రోహిత్ ఎదుగుదలకు ఎంఎస్ ధోనీనే కారణం'
న్యూఢిల్లీ : టీం ఇండియాలో కీలక బ్యాట్స్‌మాన్‌గా, వన్డే వైస్ కెప్టెన్‌గా రోహిత్ శర్మ ఎదిగాడంటే దానికి మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీనే కారణమని గౌతమ్ గంభీర్ అన్నాడు. రోహిత్ శర్మలోని ప్రతిభను గుర్తించి అతడికి ఎన్నో అవకాశాలు ఇచ్చాడని.. మధ్యలో రోహిత్ ఫామ్ కోల్పోయినా ధోనీనే వెన్నంటి ఉన్నాడని గంభీర్ వెల్లడించాడు. ఏప్రిల్ 30న రోహిత్ శర్మ పుట్టిన రోజును పురస్కరించుకొని కాస్త లేటుగా గంభీర్ విషెస్ చెప్పాడు. ఈ సందర్భంగా రోహిత్ గురించి పలు […]
న్యూఢిల్లీ : టీం ఇండియాలో కీలక బ్యాట్స్‌మాన్‌గా, వన్డే వైస్ కెప్టెన్‌గా రోహిత్ శర్మ ఎదిగాడంటే దానికి మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీనే కారణమని గౌతమ్ గంభీర్ అన్నాడు. రోహిత్ శర్మలోని ప్రతిభను గుర్తించి అతడికి ఎన్నో అవకాశాలు ఇచ్చాడని.. మధ్యలో రోహిత్ ఫామ్ కోల్పోయినా ధోనీనే వెన్నంటి ఉన్నాడని గంభీర్ వెల్లడించాడు. ఏప్రిల్ 30న రోహిత్ శర్మ పుట్టిన రోజును పురస్కరించుకొని కాస్త లేటుగా గంభీర్ విషెస్ చెప్పాడు. ఈ సందర్భంగా రోహిత్ గురించి పలు విషయాలు వెల్లడించాడు. ఏ ఆటగాడి భవిష్యత్ అయినా కెప్టెన్ చేతిలోనే ఉంటుంది. సెలక్షన్ కమిటీ, టీం మేనేజ్‌మెంట్ అవకాశం కల్పించినా కెప్టెన్ మద్దతు లేకపోతే ఎదగడం కష్టం. కానీ ఎన్నో ఏళ్లపాటు రోహిత్ శర్మకు ఎంఎస్ ధోనీ అండగా నిలిచాడని గంభీర్ చెప్పాడు. 2007లో రోహిత్ మిడిలార్డర్ బ్యాట్స్‌మాన్‌గా టీంలో అరంగేట్రం చేశాడు. కానీ చానాళ్ల పాటు అతడు ఆ స్థానంలో నిలదొక్కుకోవడానికి కష్టపడ్డాడు. కాని రోహిత్ టాలెంట్ గమనించిన ధోనీనే అతడిని 2013లో ఓపెనర్‌ను చేశాడు. ఇక అప్పటి నుంచి టాప్ ఆర్డర్‌లో ప్రమాదకరమైన బ్యాట్స్‌మెన్లలో ఒకడిగా రోహిత్ తయారయ్యాడు. ఎన్నో రికార్డులు సృష్టించాడని గంభీర్ చెప్పుకొచ్చాడు. టీం ఇండియాలో రోహిత్‌కు సహాయం చేసినంతగా ధోనీ మరెవరికీ చేసి ఉండకపోవచ్చని అన్నాడు. మున్ముందు రోహిత్ మరింతగా రాణించాలని కోరుకున్నాడు.
Tags : Rohit Sharma, Gowtham Gambhir, Cricket, Team India, BCCI, MS Dhoni