ఎంపీటీసీ భర్త దారుణ హత్య

దిశ, వెబ్‌డెస్క్ : మద్యం మత్తులో ఉన్న ఓ వ్యక్తి ఎంపీటీసీ భర్తపై దాడి చేసి హత్య చేశాడు. ఈ ఘటన జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నంలో జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. ఇబ్రహీంపట్నం ఎంపీటీసీ మమత భర్త రాజారెడ్డి, రమేశ్ అనే వ్యక్తితో కలిసి మంగళవారం రాత్రి మద్యం సేవించారు. ఆ సమయంలో ఇద్దరి మధ్య మాటామాటా పెరిగింది. ఈ క్రమంలో మద్యం మత్తులో ఉన్న రమేశ్.. బండరాయితో రాజారెడ్డిని బలంగా కొట్టి గాయపర్చాడు. తీవ్రంగా గాయపడిన […]

Update: 2021-06-15 22:37 GMT
MPTC husband brutally murder
  • whatsapp icon

దిశ, వెబ్‌డెస్క్ : మద్యం మత్తులో ఉన్న ఓ వ్యక్తి ఎంపీటీసీ భర్తపై దాడి చేసి హత్య చేశాడు. ఈ ఘటన జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నంలో జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. ఇబ్రహీంపట్నం ఎంపీటీసీ మమత భర్త రాజారెడ్డి, రమేశ్ అనే వ్యక్తితో కలిసి మంగళవారం రాత్రి మద్యం సేవించారు. ఆ సమయంలో ఇద్దరి మధ్య మాటామాటా పెరిగింది.

ఈ క్రమంలో మద్యం మత్తులో ఉన్న రమేశ్.. బండరాయితో రాజారెడ్డిని బలంగా కొట్టి గాయపర్చాడు. తీవ్రంగా గాయపడిన ఎంపీటీసీ భర్త ఘటన స్థలంలోనే హతమయ్యాడు. స్థానికుల సమాచారంతో ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేశారు. హత్యకు గల కారణాలను తెలుసుకుంటున్నారు. అనంతరం మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించారు.

Tags:    

Similar News