ఈటలతో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నా.. మహిళా ఎంపీపీ సంచలన వ్యాఖ్యలు
దిశ, హుజురాబాద్: హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ తో తనకు ఎన్నో ఇబ్బందులు ఎదురయ్యాయని జమ్మికుంట ఎంపీపీ దొడ్డె మమత సంచలన ఆరోపణలు చేశారు. శనివారం జమ్మికుంటలో మీడియాతో మాట్లాడుతూ… ఆయన వల్ల తాను ఎన్నో రకాలుగా ఇబ్బందులు ఎదుర్కొన్నానని ఆవేదన వ్యక్తం చేశారు. ఈటల రాజేందర్ తను కూర్చున్న చెట్టు కొమ్మలు నరుక్కుంటున్నాడని, పలు పదవులు అనుభవించి టీఆర్ఎస్ పార్టీని విమర్శించడం సరికాదని మమత విమర్శించారు. సొంత పార్టీ పెడతానంటూ వేరే పార్టీ నాయకులను కలవడం […]
దిశ, హుజురాబాద్: హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ తో తనకు ఎన్నో ఇబ్బందులు ఎదురయ్యాయని జమ్మికుంట ఎంపీపీ దొడ్డె మమత సంచలన ఆరోపణలు చేశారు. శనివారం జమ్మికుంటలో మీడియాతో మాట్లాడుతూ… ఆయన వల్ల తాను ఎన్నో రకాలుగా ఇబ్బందులు ఎదుర్కొన్నానని ఆవేదన వ్యక్తం చేశారు. ఈటల రాజేందర్ తను కూర్చున్న చెట్టు కొమ్మలు నరుక్కుంటున్నాడని, పలు పదవులు అనుభవించి టీఆర్ఎస్ పార్టీని విమర్శించడం సరికాదని మమత విమర్శించారు. సొంత పార్టీ పెడతానంటూ వేరే పార్టీ నాయకులను కలవడం ఎంతవరకు కరెక్ట్ అని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో పని చేస్తామని, వారు చూపించిన అభివృద్ధి బాటలోనే నడుస్తానని ఆమె స్పష్టం చేశారు. ఈ మీడియా సమావేశంలో జమ్మికుంట మున్సిపల్ కౌన్సిలర్లు, వివిధ గ్రామాల సర్పంచ్ లు పాల్గొన్నారు.
రాజీనామా చేయాలి…
ఈటల రాజేందర్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి ఎన్నికల్లో పోటీ చేయాలని టీఆర్ఎస్ యూత్, విద్యార్థి సంఘ నాయకులు డిమాండ్ చేశారు. హుజురాబాద్ లో మాట్లాడుతూ… కేబినెట్ నుంచి బర్తరఫ్ అయిన ఆత్మగౌరవమంటున్నఈటల రాజీనామా చేయడానికి ఎందుకు వెనుకాడుతున్నారని వారు ప్రశ్నించారు. ఆత్మగౌరవ నినాదం తీసుకొస్తున్నఈటల, ప్రతిపక్ష నాయకులను కలవడం వెనక ఆంతర్యం ఏంటో చెప్పాలన్నారు.